Skip to main content

National Scholarship: నేషనల్‌ స్కాలర్‌షిప్‌ అర్హత పరీక్ష..హాల్‌టికెట్స్‌ విడుదల

దండేపల్లి: ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతియేటా ఎన్‌ఎంఎంఎస్‌ (నేషనల్‌ మీన్స్‌ కం మెరిట్‌ స్కాలర్‌షిప్‌) అర్హత పరీక్ష నిర్వహిస్తోంది. ఈ నెల 24న జిల్లాలో ఎంపిక చేసిన కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనుంది. హాల్‌టికెట్లను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారని, డౌన్‌లోడ్‌ చేసుకోవాలని జిల్లా పరీక్షల నిర్వహణ విభాగం అధికారులు తెలిపారు.
National Scholarship
National Scholarship

కేంద్ర విద్యాశాఖ ప్రతియేటా ఈ పరీక్షను దేశవ్యాప్తంగా నిర్వహిస్తోంది. ప్రస్తుత విద్యాసంవత్సరంలో 8వ తరగతి విద్యార్థులు అర్హత పరీక్ష రాసేందుకు అర్హులు. ప్రతిభ కనబర్చి ఎంపికై న విద్యార్థులకు 9వ తరగతి నుంచి ఇంటర్మీడియెట్‌ వరకు ప్రతీ నెల రూ.వెయ్యి చొప్పున ఉపకార వేతనం అందుతుంది.

Spot Admissions: పీజీ కోర్సులలో స్పాట్‌ అడ్మిషన్లు.. చివరి తేదీ ఇదే

2024–25 విద్యాసంవత్సరానికి సంబంధించి పరీక్ష రాసేందుకు జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 923 మంది 8వ తరగతి విద్యార్థులు దరఖాస్తులు చేసుకున్నారు. గత విద్యాసంవత్సరంలో జిల్లా నుంచి 57 మంది ఎంపికయ్యారు.

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

Published date : 20 Nov 2024 05:01PM

Photo Stories