PM Shri Scheme : పాఠశాలల్లో పీఎం శ్రీ పథకానికి మరోసారి శ్రీకారం..

సాక్షి ఎడ్యుకేషన్: మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునిక విద్య ప్రతి విద్యార్థికి అవసరమే. ఇందులో భాగంగా సర్కారు పాఠశాలలను ఆధునిక పరిశోధన కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా (పీఎం శ్రీ) పథకానికి శ్రీకారం చుట్టింది.
ఇందులో భాగంగా పాఠశాలల్లో మరోసారి కంప్యూటర్ విద్యను అమలు చేయాలని నిర్ణయించింది. విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానం అందించాలనే ఉద్దేశంతో మొదటి విడతలో ఎంపికైన పీఎంశ్రీ పాఠశాలలకు పది డెస్క్ టాప్ కంప్యూటర్లు, ఒక ప్రింటర్, 2 కేవీ ఇన్వర్టర్ల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 487 పాఠశాలలకు 4870 కంప్యూటర్లు, 487 ప్రింటర్లు, 974 2కేవీ ఇన్వర్టర్లు మంజూరు చేస్తూ ఈ నెల 14న పాఠశాల స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ సమగ్రశిక్ష నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి.
Holiday News for Students : శుభవార్త.. నేడు విద్యాసంస్థలకు సెలవు.. ఈ జిల్లాల్లోనే..
పాఠశాలలో కంప్యూటర్ విద్య విద్యార్థుల కెరీర్ అభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇంటర్నెట్‌తో కూడిన కంప్యూటర్ అనేది విద్యార్థుల కొత్త నైపుణ్యాలు, ప్రస్తుత పాఠాల అధునాతన వెర్షన్‌ను నేర్చుకోవడానికి దోహద పడనుంది.
పీఎంశ్రీ కింద పాఠశాలల్లో..
పీఎంశ్రీ పథకం కింద మొదటి దఫాలో ఎంపికైన ఉన్నత పాఠశాలల్లో సాంకేతిక విద్య అమలులోకి రానుంది. జిల్లా వ్యాప్తంగా 11 పాఠశాలలను ఎంపిక చేశారు. ఆయా పాఠశాలలకు కంప్యూటర్లు, ప్రింటర్లు, 2కేవీ ఇన్వర్టర్లు మంజూరు చేశారు. సెల్కాన్ ఇంపెక్స్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ సామగ్రిని పాఠశాలలకు సరఫరా చేయనుంది. ప్రతి ఎమ్మార్సీకి సరఫరా చేయబడిన ఎలక్ట్రికల్ నెట్‌వర్కింగ్ సిస్టమ్‌తో పాటు డెస్క్‌టాప్, ప్రింటర్‌లు, యూపీఎస్ సిస్టమ్‌లు, ఇన్‌స్టాలేషన్ చేసిన తర్వాత ధ్రువీకరించాలి.
ఇప్పటికే ఫీల్డ్‌ట్రిప్, ఎక్స్‌ఫోజర్ విజిట్, సైన్స్ మ్యాథ్స్ యాక్టివిటీ, స్కూల్ యాన్‌వల్‌డే, ట్వినింగ్ మోటివేషనల్ లెక్చర్స్ నిర్వహణకు సంబందించిన నిధులు విడుదలయ్యాయి. ఇదివరకు పీఎంశ్రీ పాఠశాలల్లో చదివే విద్యార్థులను ఫీల్డ్‌టూర్‌కు తీసుకెళ్లారు. ఎన్టీపీసీ, అగ్రికల్చరల్( వ్యవసాయక్షేత్రాలు), పరిశ్రమలు, ఇలా క్షేత్రస్థాయి పర్యటనలు చేశారు. పాఠశాలల్లో సౌర విద్యుత్ దీపాల ఏర్పాటు తోటల పెంపకం, నీటి సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ, స్వచ్చత చర్యలు, బోమ్మలతో బోధన, విద్యార్థుల సామర్థ్యాల ముదింపు వంటివి చేపడుతారు. ఉపాధి అవకాశాలపైనా అవగాహన, సాంస్కృతిక కార్యక్రమాలు, విస్తృతంగా నిర్వహణతో పాటు సాంకేతిక విద్య వైపు అడుగులు పడుతున్నాయి.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- PM SHRI Scheme
- School Students
- Technology education
- computer training
- Govt Schools
- Modern education
- Central Government Prime Minister's Schools for Rising India
- students education development
- Telangana Govt
- Education Department
- telangana private and govt schools
- computer education for school students
- Career Guidance
- students skills development
- 11 schools for pm shri
- high schools for pm shri scheme
- Education News
- Sakshi Education News