Skip to main content

Schools And Colleges Holiday News: స్కూళ్లు, కాలేజీలకు రెండు రోజుల పాటు సెలవులు.. కారణం ఇదే

విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. తెలుగు రాష్ట్రాల్లో స్కూళ్లు, కాలేజీలకు వరుసగా రెండు రోజుల పాటు సెలవులు వస్తున్నాయి. రేపు(ఫిబ్రవరి26)న శివరాత్రి కావడంతో అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. మహాశివరాత్రిని హిందువులు ఎంతో పవిత్రంగా విశ్వసిస్తారు.పరమశివుడికి ఇష్టమైన శివరాత్రికి ఉపవాసం ఉండి శివాలయాలను సందర్శిస్తుంటారు. భారతదేశం అంతటా ఎంతో వైభవంగా శివరాత్రిని జరుపుకుంటారు. 
Schools And Colleges Holiday News
Schools And Colleges Holiday News

ఇక ఆ తర్వాతి రోజు అంటే ఫిబ్రవరి 27న తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి. తెలంగాణలో ఉమ్మడి మెదక్-ఆదిలాబాద్-నిజామాబాద్-కరీంనగర్ నియోజకవర్గానికి టీచర్ తో పాటు గ్రాడ్యుయేట్ ఎన్నికలు జరుగుతున్నాయి.

⇒ అలాగే ఉమ్మడి వరంగల్-ఖమ్మం-నల్గొండ స్థానానికి కూడా ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ జిల్లాల్లో ఫిబ్రవరి 27 అంటే శివరాత్రి తర్వాతి రోజు పోలింగ్ జరగనుంది. కాబట్టి ఆయా జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ఉంటుంది. 

26th February is a holiday for educational institutions   Maha Shivaratri 2025 holiday announcement for Telangana schools and colleges February 26 public holiday notification for Maha Shivaratri in Telangana  Public holiday on February 26 for Maha Shivaratri celebrations in Telangana

PM Internship Scheme Applications : పీఎం ఇంటర్న్‌షిప్ స్కీమ్.. టాప్‌ 500 కంపెనీలు, ప్రతినెలా స్టైఫండ్‌..

⇒ ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ఇలాగే ఉమ్మడి తూర్పు గోదావరి- పశ్చిమ గోదావరి, ఉమ్మడి కృష్ణా-గుంటూరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంతో పాటు శ్రీకాకుళం-విజయనగరం-విశాఖపట్నం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి కూడా ఫిబ్రవరి 27న పోలింగ్ జరగనుంది. ఈ జిల్లాల్లో విద్యాసంస్థలకు ఆ రోజు సెలవు ఉంటుంది. ఇలా ఇరురాష్ట్రాల్లో ఎమ్మెల్సీ పోలింగ్ నేపథ్యంలో ఆయా జిల్లాల్లో టీచర్లకు సాధారణ సెలవు ఇవ్వనున్నారు.

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

Published date : 25 Feb 2025 05:18PM

Photo Stories