DSC : డీఎస్సీపై ఆశలు అభ్యర్థులకు అడియాశలేనా..! ఎందుకంటే..?
కడప ఎడ్యుకేషన్: డీఎస్సీ నిర్వహణపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇటీవల చేసిన ప్రకటనతో అధికారుల్లో కదలిక వచ్చినా తరువాత మళ్లీ స్తబ్దత నెలకొంది. ఈనెల 6వ తేదీ తర్వాత డీఎస్సీ నిర్వహణపై ప్రకటన వెలువడుతుందని అభ్యర్థులు ఆశగా ఎదురు చూశారు. ఇప్పటికీ ప్రకటన విడుదల కాకపోవడంతో వారి ఆశలు అడియాశలుగా మిగిలాయి.
మళ్లీ అభ్యర్థులకు ఎదరుచూపులు తప్పడం లేదు. ఇప్పటికే ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో ఖాళీ టీచర్ పోస్టుల భర్తీకి విద్యాశాఖ అధికారులు కసరత్తు చేశారు. ఇందుకు సంబంధించిన నివేదికలను కూడా ఉన్నతాధికారులకు పంపించారు.
FLN and Leadership Training : తొలి విడత లీడర్‌షిప్, రెండో విడత ఎఫ్‌ఎల్‌ఎన్ శిక్షణలు ముగిసాయి..
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ నిర్వహిస్తామని హామీ ఇచ్చింది. దీంతోపాటు మంత్రి లోకేష్ డీఎస్సీ నిర్వహణకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఇటీవల ప్రకటించారు. ఆ తర్వాత మళ్లీ ప్రకటనపై నోరుమెదపకపోవడంతో అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. ఇప్పటికే అభ్యర్థులు నెలల తరబడి కోచింగ్ సెంటర్లలో శిక్షణ పొందుతూ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
విడుదలైన టెట్ పలితాలు..
అక్టోబర్ 3వ తేదీ నుంచి 21వ తేదీ వరకు ఆన్‌లైన్ విధానంలో జిల్లాలో కడప, ప్రొద్దుటూరు కలిపి 8 కేంద్రాల్లో టెట్ పరీక్షను నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 23,044 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వారం క్రితం ఫలితాలు కూడా విడుదలయ్యాయి. డీఎస్సీ నిర్వహణపై కసరత్తు ప్రారంభం కావడంతో పాటు మరో నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి ప్రకటించడంతో అభ్యర్థుల్లో ఆశలు చిగురించాయి. కానీ ఆ తర్వాత ఎలాంటి ముందడుగు లేకపోవడంతో నిరుత్సాహానికి గురయ్యారు.