FLN and Leadership Training : తొలి విడత లీడర్‌షిప్, రెండో విడత ఎఫ్‌ఎల్‌ఎన్ శిక్షణలు ముగిసాయి..
అనంతపురం ఎడ్యుకేషన్: ఈ నెల 4 నుంచి ప్రారంభమైన తొలి విడత లీడర్‌షిప్, రెండో విడత ఎఫ్‌ఎల్‌ఎన్ శిక్షణలు శనివారంతో ముగిశాయి. రెండు శిక్షణలూ ఆరు రోజుల పాటు రెసిడెన్షియల్ పద్ధతిలో జరిగాయి. నగర శివారులోని బళ్లారిరోడ్డు సీఆర్‌ఐటీలో జరిగిన లీడర్‌షిప్ ట్రైనింగ్‌లో అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య జిల్లాల నుంచి మండల విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు మొత్తం 249 మంది హాజరయ్యారు.
Walk-in Interview: పదో తరగతి అర్హతతో ఉద్యోగాలు.. నెలకు రూ. 28,000 జీతం
బుక్కరాయసముద్రం సమీపంలోని విజయభారతి డీఎడ్ కళాశాలలో జరిగిన ఎఫ్‌ఎల్‌ఎన్ శిక్షణకు అనంతపురం, కర్నూలు జిల్లాల నుంచి 235 మంది 1, 2 తరగతులు బోధించే ఎస్జీ టీచర్లు హాజరయ్యారు. లీడర్‌షిప్ ట్రైనింగ్ ముగింపు సందర్భంగా డీఈఓ ప్రసాద్‌బాబు మాట్లాడుతూ శిక్షణలో భాగంగా నేర్చుకున్న అంశాలను మండలాలు, పాఠశాలల్లో అమలు చేయాలన్నారు. నాయకత్వ లక్షణాలను తాము పాటిస్తూ ఉపాధ్యాయులు, విద్యార్థుల్లో పెంపొందింపజేయాలన్నారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
☛ Join our WhatsApp Channel (Click Here)
☛ Join our Telegram Channel (Click Here)
ఎఫ్‌ఎల్‌ఎన్ శిక్షణ ముగింపు సందర్భంగా సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ నాగరాజు మాట్లాడుతూ 1, 2 తరగతుల పిల్లల స్థాయికి వారితో మమేకమై బోధన చేయాలన్నారు. వివిధ రకాల బోధనా పద్ధతులను అవలంబించాలని, అప్పుడే చిన్న పిల్లలకు సులభంగా అర్ధమవుతాయని తెలిపారు. కార్యక్రమంలో ఉప విద్యాధికారి శ్రీనివాసులు, రాష్ట్ర పరిశీలకులు హైమేశ్వరరావు, ఏఎంఓ చంద్రశేఖర్ రెడ్డి, రిసోర్స్ పర్సన్స్ పాల్గొన్నారు.
Career Guidance : 8 నుంచి 10వ తరగతి విద్యార్థులకు కెరీర్ గైడెన్స్‌పై శిక్షణ