Skip to main content

TSPSC Jobs Updates 2024 : టీఎస్‌పీఎస్సీ ప‌రీక్ష‌ల‌కు తొలగిన అడ్డంకులు.. సెప్టెంబ‌ర్‌లో నియామకాలు...!

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్ పోస్టుల భ‌ర్తీకి ఎట్టకేల‌కు అడ్డంకులు తొలిగాయి. పశుసంవర్ధక శాఖలో ఎప్పటి నుంచో నానుతున్న పశువైద్యుల పోస్టులకు ఇన్నాళ్లకు మోక్షం లభించింది. గత ప్రభుత్వం మొత్తం 185 పశువైద్యుల పోస్టుల భర్తీకి 2022 డిసెంబరు 30న నోటిఫికేషన్‌ ఇచ్చింది.
TSPSC notification for 185 veterinarian posts  TSPSC 2022 notification for veterinarian jobs TSPSC Veterinary Assistant Jobs 2024 Again Notification  TSPSC Veterinary Assistant Surgeon posts cleared

ఈ పోస్టులకు గతేడాది జులై 13, 14 తేదీల్లో పరీక్షలు నిర్వహించారు. కొన్ని కారణాల రిత్యా ఆ పోస్టుల భర్తీ ప్రక్రియ అప్పటి నుంచి పెండింగ్‌లోనే ఉంది. తాజాగా ఈ ప్రక్రియను టీఎస్‌పీఎస్సీ పూర్తి చేసింది. తాజాగా TSPSC ఈ ఉద్యోగాల‌కు సంబంధించిన‌ ఫలితాలు వెల్లడించింది. త్వరలోనే నియామక పత్రాలు కూడా అందించనుంది. మొత్తం 185 పోస్టులకు గానూ 171 పోస్టులకు మాత్రమే అభ్యర్థులను ఎంపిక చేసింది. మరో 14 పోస్టులకు అర్హులు లేకపోవడంతో ప్రస్తుతం వాటి భర్తీ ప్రక్రియను చేపట్ట లేదు. సెప్టెంబరు 15వ తేదీ నాటికి ఎంపికైన 171 మంది వీఏఎస్‌లకు నియమక ఉత్తర్వులు పంపిణీ చేయనున్నారు. 

☛➤ AEE Ranker Success Story : రోడ్డు ప్రమాదంలో ఒక కాలు కోల్పోయాడు.. సంక‌ల్ప బ‌లంతో ఏఈఈ ఉద్యోగం కొట్టాడిలా... కానీ

మళ్లీ నోటిఫికేషన్ వ‌చ్చే అవ‌కాశం..
పశు సంవర్ధక శాఖలో గడిచిన రెండేళ్లలో పదవీ విరమణలు, పదోన్నతులు, ఇతర కారణాల వల్ల మరో 121 వీఏఎస్‌ల పోస్టులు ఖాళీ అయినట్లు కమిషన్‌ వర్గాలు చెబుతున్నాయి. వాటి భర్తీకి మళ్లీ నోటిఫికేషన్‌ వెలువరించే అవకాశం ఉంది.

Published date : 30 Aug 2024 01:53PM

Photo Stories