Skip to main content

JL Appointment Letters: 9న టీచర్‌ నియామక పత్రాలు.. మ‌రి జే.ఎల్ నియామక పత్రాలు ఎప్పుడు?

సాక్షి, హైదరాబాద్: విద్యను బలోపేతం చేయడంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు కూడా చాలా ముఖ్యం.
TGPSC Junior Lecturer Recruitment Appointment Letters

రాష్ట్రంలో  425 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉంటే ఇప్పటివరకు బోధకులు సరిగా లేకపోవడం వల్ల  విద్యావ్యవస్థ మ‌రుగున‌ పడుతుంది. విద్యార్ధులు ఇంటర్మీడియట్ పాస్ అయిన తర్వాత ఎంసెట్, జేఈఈ, నీట్ మొదలైన పరీక్షలు రాయడానికి అర్హులు అవుతారు. వారికి బోధించేందుకు సరిపడే బోధకులు లేకపోవడం వల్ల ప్రభుత్వ కళాశాలలో చదివే విద్యార్థులు నష్టపోవడం జరుగుతుంది.

2022 లో TGPSC ద్వారా 1392 జూనియర్ లెక్చరర్ నోటిఫికేషన్ రావడం జరిగింది . 2023లో పరీక్ష జరగగా 2024లో జూనియర్ లెక్చరర్స్ ల జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఫలితాలు విడుదల చేసి  1:2 పద్ధతిలో  అభ్యర్ధుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేయడం జరిగింది. ఇప్పటివరకు  తుది ఫలితాలు రాకపోవడం జే.ఎల్ అభ్యర్థులు మానసిక ఆందోళనకు లోనవుతున్నారు.

చదవండి: DSC Merit Lists: జిల్లాలకు డీఎస్సీ మెరిట్‌ జాబితాలు.. ఒక్కో పోస్టుకు ఇంత‌ మంది చొప్పున ఎంపిక

అదే విధంగా 56 రోజులోనే  11 వేల DSC అభ్యర్థుల ఫలితాలు, అపాయింట్మెంట్ ఆర్డర్స్ ప్రభుత్వం ఇవ్వడం గర్వకారణం. కానీ రెండు సంవత్సరాలు అయినా 1392 జూనియర్ లెక్చరర్స్ ల  నియామక పత్రాలు ఇవ్వకపోవడం పట్ల జూనియర్ లెక్చరర్స్ అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. 

డీఎస్సీ విడుదల చేసే సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్య బలోపేతం చేయడం కోసం ప్రభుత్వం కృషిచేస్తోంది అని అన్నారు.

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here

9 అక్టోబర్ నాడు టీచర్లకు నియామక పత్రాలు అందిస్తాము అనే మాట చాలా సంతోషకరమైనది.. ఈ సందర్భంగా టీచర్లతో పాటు  1392 జూనియర్ లెక్చరులకు కూడా నియామక పత్రాలు అందిస్తే.. ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యా వ్యవస్థను బలోపేతం చేయడంలో జూనియర్ లెక్చరర్స్ అభ్యర్థులు ముందు ఉంటాము అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అభ్యర్థిస్తున్నారు.

Published date : 03 Oct 2024 11:19AM

Photo Stories