Group 1, 2, 3 Exams: పరీక్షల నేపథ్యంలో పంచాయతీ కార్యదర్శులు దీర్ఘకాలిక సెలవులు..పరిపాలన అస్తవ్యస్తం..
గాంధీనగర్ పంచాయతీ కార్యాలయం
జిల్లాలో గ్రామ పంచాయతీ సర్పంచ్‌ల పదవీకాలం ముగిసినా ఎన్నికలు నిర్వహించకపోవడంతో గ్రామాల్లో ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది. ప్రత్యేకాధికారులకు వారి శాఖల పనులతోపాటు పంచాయతీల బాధ్యతలను నిర్వహించడం తలకు మించిన భారంగా మారింది.
ఈ క్రమంలో కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తూ గ్రామాలకు సరిగా రావడం లేదు. ఈ భారమంతా పంచాయతీ కార్యదర్శుల పై పడుతుంది. ప్రభుత్వం మారడం అధికార పార్టీ నాయకులు కార్యదర్శుల పై ఒత్తిడి చేయడం వంటి సమస్యలతో కార్యదర్శులు విధులు నిర్వహించలేక సెలవుల్లోకి వెళ్తుతున్నారు.
చదవండి: టీఎస్‌పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ
గ్రూప్స్ పరీక్షల సాకుతో సెలవులు..
జూనియర్ పంచాయతీ కార్యదర్శుల ఉద్యోగాలను ప్రభుత్వం రెగ్యులర్ చేసింది. గ్రామ పరిపాలన, ప్రజల సమస్యలు, గ్రామాల్లో తాగునీరు, పారిశుద్ధ్యం పనులు చేయడానికి నిధులు లేక సొంత డబ్బులను ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక్కొక్క కార్యదర్శికి సమీప గ్రామాల ఇన్‌చార్జి బాధ్యతలను ఇవ్వడంతో రెండు గ్రామాల సమస్యలు కార్యదర్శులకు భారమవుతున్నాయి.
పంచాయతీ ఎన్నికల ఓటరు జాబితల తయారీ, ఎల్‌ఆర్‌ఎస్ క్షేత్ర స్థాయి విచారణ పనులు కార్యదర్శులకు ఇబ్బందులను కలిగిస్తున్నాయి. ఇదే సమయంలో గ్రూప్స్ పరీక్షల కోసం నోటిఫికేషన్ విడుదల కావడంతో ఉన్నత ఉద్యోగాలు సాధించాలనే లక్ష్యంతో పంచాయతీ కార్యదర్శులు సెలవులు పెడుతున్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా గ్రూప్ 1 పరీక్ష కోసం 10 మంది పంచాయతీ కార్యదర్శులు సెలవు పెట్టారు. అలాగే హుస్నాబాద్‌లో ఐదుగురు కార్యదర్శులు గ్రూప్ 2, 3 పరీక్షల పేరుతో సెలవు పెట్టి విధులకు హాజరు కావడం లేదు. మరో 50 మంది సెలవుల కోసం జిల్లా పంచాయతీ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |
ఇందిరమ్మ కమిటీల ఊసే లేదు
ప్రభుత్వం పేదలకు పక్కా ఇంటిని నిర్మించాలని దానికి పేదలకు ఇందిరమ్మ పథకం కింద ఆర్థిక సహాయం అందించాలనే ఆలోచనతో ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించింది. కానీ గ్రామాల్లో సర్పంచ్‌లు లేరు. అధికార పార్టీ నాయకులు పంచాయతీ కార్యదర్శులకు, ప్రత్యేక అధికారులకు సహకారం అందించకపోవడంతో ఇప్పటికీ ఇందిరమ్మ కమిటీలు కొల్కి రాలేదు. గ్రామాల్లో ప్రభుత్వం ప్రజలకు ఇస్తున్న సంక్షేమ పథకాల గురించి సమాచారం ఇవ్వడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.
సెలవుల్లో ఐదుగురు వెళ్లారు
హుస్నాబాద్ మండలంలో ఐదుగురు పంచాయతీ కార్యదర్శులు సెలవు పెట్టి వెళ్లారు. ఇప్పటికే సెలవుల్లో వెళ్లిన వారు సైతం తిరిగిరాకపోవడంతో ఆయా గ్రామాల బాధ్యతలను మరొకరికి ఇన్‌చార్జిగా అప్పగించాం. రెండు గ్రామాల బాధ్యతలను ఒకరే నెలల తరబడి చూడాలంటే కష్టంగానే ఉంటుంది. సెలవు ఎందుకంటే గ్రూపు పరీక్షలు ఉన్నాయని సమాధానం ఇస్తున్నారు. కార్యదర్శుల సెలవులపై ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చాం.
– వేణుగోపాల్‌రెడ్డి, ఎంపీడీఓ, హుస్నాబాద్