Skip to main content

TGPSC New Chairman 2024 : టీఎస్‌పీఎస్సీ కొత్త ఛైర్మన్ ఇత‌నే... కానీ..!

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొత్త ఛైర్మన్‌గా బుర్రా వెంకటేశం ఐఏఎస్ ఆఫీస‌ర్‌ను నియ‌మించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం బుర్రా వెంకటేశం విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా ప‌నిచేస్తున్నారు.
IAS Burra Venkatesham Appointed TGPSC Chairman  Burra Venkatesham appointed as new chairman of Telangana Public Service Commission Telangana government issues order for Burra Venkatesham as TSPSC chairman Burra Venkatesham to lead Telangana Public Service Commission

డిసెంబర్ 3వ తేదీతో ప్రస్తుత టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ మహేందర్ రెడ్డి పదవీకాలం ముగియ‌నున్న విష‌యం తెల్సిందే.ఈ నేపథ్యంలో మహేందర్ రెడ్డి స్థానంలో మరొకరిని నియమించేందుకు తెలంగాణ ప్రభుత్వం కొద్దిరోజుల కిందటే నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హులైన వారి నుంచి దరఖాస్తులను స్వీకరించింది. 

నవంబర్ 20వతేదీతో ప్రక్రియ పూర్తి అయింది.  ప్రభుత్వం నియమించిన స్క్రీనింగ్‌ కమిటీ, ఈ దరఖాస్తులను పరిశీలించి బుర్రా వెంకటేశం పేరును ఖరారు చేసింది. నియామకం ఆమోదం కోసం ఫైల్‌ను రాజ్‌భవన్‌కు పంపించగా గవర్నర్ ఆమోదముద్ర వేశారు. రానున్న టీఎస్‌పీఎస్సీ కొత్త చైర్మన్‌ ముందు ఎన్నో స‌వాళ్లు ఉన్నాయి. ఇప్ప‌టికే చాలా ఉద్యోగాల నోటిఫికేష‌న్లు ఫెండింగ్‌లో ఉన్నాయి. బుర్రా వెంకటేశం టీజీపీఎస్సీ ఛైర్మన్​గా దాదాపు నాలుగు నుంచి ఐదేళ్ల పాటు కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తొంది.

➤☛ IPS Success Story : ఈ కార‌ణంతోనే రూ.30 లక్షల జీతం జాబ్‌కు రాజీనామా చేసి.. ఐపీఎస్ ఆఫీసర్ అయ్యానిలా.. కానీ..!

టీఎస్సీపీఎస్సీ స‌భ్యులు కూడా...
మూడు నాలుగు నెలల వ్యవధిలోనే టీజీపీఎస్సీ కమిషన్‌ సభ్యురాలు అనితా రాజేంద్ర, ఆ తర్వాత రామ్మోహన్‌రావు వరుసగా పద వీవిరమణ పొందనున్నారు. దీంతో టీజీపీఎస్సీ సగానికి పైగా ఖాళీ కానుంది. ఈ పోస్టులను కూడా త్వరలోనే భర్తీ చేయనున్నారు.

➤☛ Government Jobs Notifications 2024 : 53000 ఉద్యోగాలు... ఈ ఏడాదిలోనే.. ఎలా అంటే...?

బుర్రా వెంకటేశం IAS తెలంగాణ‌లోని జనగామ జిల్లాలో జన్మించారు. 1995 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన అధికారి ఈయ‌న‌. ఈయ‌న రాజ్‌భవన్ సెక్రటరీగా ఉండటంతో పాటు విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీగా, బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.

Published date : 02 Dec 2024 09:58AM

Photo Stories