New Ration Cards : కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోండిలా.. అర్హతలు ఇవే..!
సాక్షి ఎడ్యుకేషన్: రాష్ట్రంలోని లక్షలాది ప్రజలు ఎప్పటి నుంచో కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్నారు. వారందరికీ ప్రభుత్వ శుభవార్త చెప్పింది. ఈ నెల 26 అంటే, గణతంత్ర దినోత్సవం రోజు నుంచి పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో కొత్త రేషన్ కార్డులు జారీ కానున్నాయి. అయితే, తెలంగాణలో ఇటీవలె కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన మార్గ దర్శకాలను కూడా ప్రభుత్వం విడుదల చేసింది. ఇక్కడ కొన్ని ముఖ్యమైన అంశాలను పరిశీలిద్దాం..
1. ముసాయిదా జాబితాను గ్రామసభ, వార్డులో ప్రదర్శిస్తారు. లబ్ధిదారుల పేర్లను చదివి వినిపించి చర్చించిన తర్వాత ఆమోదిస్తారు.
2. దరఖాస్తులను నిశితంగా పరిశీలించిన తర్వాత.. కుల గణన సర్వే ఆధారంగా రేషన్ కార్డులు లేని కుటుంబాల జాబితాను జిల్లా కలెక్టర్, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు పంపిస్తారు.
3. మీసేవా సర్వీస్ ఫారమ్‌లపై క్లిక్ చేస్తే.. అక్కడ వివిధ విభాగాల ఫారంలు కనిపిస్తాయి. అప్పుడు పౌర సరఫరాల శాఖ ఎంపికపై క్లిక్ చేయాలి.
4. మంత్రివర్గ ఉపసంఘం సిఫారసులకు అనుగుణంగా కొత్త రేషన్ కార్డుల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ జరగనుంది.
5. ఆహార భద్రత కార్డుల్లో కుటుంబ సభ్యుల చేర్పులు, మార్పులు జరగనున్నాయి. అర్హత కలిగిన కుటుంబాలకు ఈ నెల 26 నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేయనున్నారు.
6. దరఖాస్తుదారు పేరు, వయస్సు, లింగం, తండ్రి, పేరు, చిరునామా వివరాలతో సహా.. మొబైల్ నంబర్, అవసరమైన అన్ని సమాచారాన్ని దరఖాస్తు ఫారమ్‌లో పూరించాలి. అర్హత వివరాలు, జిల్లా, ప్రాంతం, కుటుంబ సభ్యుల సంఖ్య, కుటుంబం ఆదాయం మొదలైన వివరాలు నమోదు చేయాలి.
7. మండల స్థాయిలో ఎంపీడీవో, యూఎల్‌బీలో మున్సిపల్ కమిషనర్ ఈ ప్రక్రియకు బాధ్యులుగా వ్యవహరిస్తారు.
8. ఆహార భద్రతా కార్డ్ కోసం దరఖాస్తు ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి. దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసిన తర్వాత.. ప్రింట్ అవుట్ తీసుకోవాలి.
Engineering Syllabus Changes : ఇంజినీరింగ్ సిలబస్‌లో చేయనున్న మార్పులు ఇవే...! ఇంకా..
9. రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలనుకుంటే.. ముందుగా దరఖాస్తు ఫారమ్ నింపాలని అధికారులు ప్రాథమికంగా చెబుతున్నారు. దరఖాస్తు ఫారం మీసేవా కేంద్రంలో లేదా మీసేవా అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుందని అంటున్నారు.
10. అన్ని పత్రాలను జతచేసి, దరఖాస్తు ఫారమ్‌ను నిర్ణీత రుసుముతో మీసేవా కేంద్రంలో సమర్పించాలి. అక్నాలిడ్జ్ స్లిప్ తీసుకోవడం మర్చిపోవద్దు. దరఖాస్తు చేయడానికి.. నివాస రుజువు ధ్రువీరకణ పత్రం, ఆధార్ కార్డు జిరాక్స్, దరఖాస్తుదారుడి పాస్‌పోర్ట్ సైజు ఫోటో అవసరం ఉంటుందని అధికారులు ప్రాథమికంగా చెప్పారు. దీంట్లో ప్రభుత్వం మార్పులు, చేర్పులు చేసే అవకాశం కూడా ఉంది.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- ration cards
- telangana state
- new ration cards
- key points for ration cards
- mee seva service
- telangana people
- applications for ration cards
- Food safety card
- online applications for ration and food safety cards
- new ration cards applications
- january 26th
- good news for telangana people
- Republic Day
- Civil Supplies Department
- Education News
- Sakshi Education News
- TelanganaRationCards
- CivilSuppliesDepartment
- RationCardUpdates
- TelanganaGovernment
- RepublicDayLaunch
- PublicDistributionSystem
- TelanganaCitizens