Skip to main content

Holiday News for Students : విద్యార్థుల‌కు శుభ‌వార్త‌.. నెల‌లో ఆఖ‌రి సెల‌వు ఇదే.. కానీ..

విద్యార్థుల‌కు జ‌న‌వ‌రి ప్రారంభంలోనే అనేక సెల‌వులు వ‌చ్చాయి. మొద‌ట్లో న్యూ ఇయ‌ర్ అంటూ ఒక‌రోజు సెల‌వు, ఆ త‌ర‌వాత సంక్రాంతి సెలవుల‌ని వారం రోజులు, కొంద‌రికి ప‌ది రోజులు సెల‌వులు ఇచ్చింది ప్ర‌భుత్వం.
January last holiday announcement for students   Shab-e-Meraj holiday announcement for January 28, 2025

సాక్షి ఎడ్యుకేష‌న్: విద్యార్థుల‌కు జ‌న‌వ‌రి ప్రారంభంలోనే అనేక సెల‌వులు వ‌చ్చాయి. మొద‌ట్లో న్యూ ఇయ‌ర్ అంటూ ఒక‌రోజు సెల‌వు, ఆ త‌ర‌వాత సంక్రాంతి సెలవుల‌ని వారం రోజులు, కొంద‌రికి ప‌ది రోజులు సెల‌వులు ఇచ్చింది ప్ర‌భుత్వం. అయితే, ఇప్ప‌టికే సెల‌వులు ముగిసి పాఠ‌శాల‌లు తెరుచుకున్నాయి. విద్యార్థులు కూడా తిరిగి విద్యాసంస్థ‌లకు వెళ్ల‌డం ప్రారంభించారు. ఇప్పుడు, మ‌రోసారి విద్యార్థులకు సెల‌వుల వార్త రానుంది. త్వ‌ర‌లోనే మ‌రో సెల‌వు ఉంటుంద‌ని తెలుస్తోంది.

School and Colleges Holidays Extended : స్కూల్స్‌, కాలేజీల‌కు సెలవులు పొడిగింపు...!

ఇటీవ‌ల, సంక్రాంతి సెల‌వుల‌ను త‌మ కుటుంబాల‌తో గ‌డిపిన విద్యార్థులు బ‌డిబాట ప‌ట్టారు. మరోసారి సెల‌వులంటూ విద్యార్థుల‌కు శుభ‌వార్త అంద‌నుంది. నిజానికి, రానున్న రోజుల్లో విద్యార్థుల‌కు రెండు సెల‌వులు రానున్నాయి అవే, జ‌న‌వ‌రి 26, 28.. ఈ రెండు రోజులు ప్ర‌భుత్వ సెల‌వులే కావ‌డంతో ప్ర‌తీ విద్యా సంస్థ‌ల‌కు ఉద్యోగుల‌కు సెల‌వు ఉంటుంది. కాని, ఈసారి జ‌న‌వ‌రి 26 గ‌ణ‌తంత్ర దినోత్స‌వం ఆదివారం రావ‌డంతో సెల‌వు ప్ర‌త్యేకంగా ఉండ‌దు.

Sankranti Holidays Extended : గుడ్‌న్యూస్‌... సంక్రాంతి సెలవులు పొడిగింపు... స్కూల్స్‌, కాలేజీల‌కు కూడా..

కాని, జ‌న‌వ‌రి 28న షబ్ ఏ మేరాజ్ కావడంతో దీనిని ప్ర‌త్యేక సెల‌వు ఉంటుంది. కాని, ఇక్క‌డ మ‌రో విష‌యం ఏంటంటే.. ఈ సెల‌వు కేవ‌లం తెలంగాణ మైనార్టీ విద్యాసంస్థ‌ల‌ విద్యార్థుల‌కు మాత్ర‌మే వ‌ర్తిస్తుంది. కాగా, సెల‌వు కూడా వారికి మాత్ర‌మే ఉంటుంది.

చివ‌రి సెల‌వు..

జ‌న‌వ‌రి నెల‌లో 28న వ‌చ్చే షబ్ ఏ మేరాజ్‌కు ప్ర‌భుత్వ మైనార్టీల‌కు సెల‌వు ఇచ్చింది. కాగా, ఈ నెల‌లో ఇది చివరి సెల‌వు, కాని మిగతా పాఠశాలల నిర్వహణ లేదా హాలీడే పై సొంతంగా నిర్ణయం తీసుకుంటే మాత్రం మ‌రి కొన్ని పాఠ‌శాల‌ల‌కు, కాలేజీల‌కు కూడా సెల‌వు ప్ర‌క‌టించే అవకాశం ఉంటుంది. మరి ఆ రోజు అన్ని ప్రభుత్వ పాఠశాలలకు సెలవులు ఇస్తారో లేదో చూడాలి.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 22 Jan 2025 11:39AM

Photo Stories