Gurukul Admissions 2025 : మైనార్టీ గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తులు.. ఇదే చివరి తేది
Sakshi Education
నాగర్‌కర్నూల్ రూరల్/ కందనూలు: తెలంగాణ మైనార్టీ గురుకుల పాఠశాలల్లో ఐదో తరగతి నుంచి 8వ తరగతి వరకు, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి గోపాల్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. వచ్చేనెల 28లోగా ఆన్‌లైన్‌లో వెబ్‌సైట్ www.tmreistelangana.cgg.gov.in దరఖాస్తు చేసుకుని, వాటిని కార్యాలయంలో అందజేయాలని కోరారు.
Gurukul Admissions 2025
ఏప్రిల్ 24న 5, 6, 7, 8వ తరగతి ప్రవేశ ప్రక్రియ ఉంటుందన్నారు. కళాశాల విద్యార్థులకు మే 1 నుంచి 10 వరకు పరిశీలన ఉంటుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాల కోసం సెల్ నంబర్లు 79950 57971, 73311 70833, 79974 43329, 73311 70834లను సంప్రదించాలని చెప్పారు.