Telangana: తెలంగాణ ప్రభుత్వంతో.. మేఘా ఇంజనీరింగ్ మూడు కీలక ఒప్పందాలు.. రూ.15 వేల కోట్ల పెట్టుబడులు

దావోస్‌లో వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో జరుగుతున్న సమావేశాల్లో ఈ ఒప్పందాలు కుదిరాయి. రూ.11 వేల కోట్లతో 2160 మెగావాట్ల పంప్‌డ్ స్టోరేజ్ ప్రాజెక్టును తెలంగాణలో మేఘా సంస్థ ఏర్పాటు చేయనుంది. తద్వారా నిర్మాణ దశలో వేయి, నిర్వహణ దశలో 250 ఉద్యోగాల కల్పన సాధ్యమవుతుంది. అలాగే, రాష్ట్రవ్యాప్తంగా బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ వ్యవస్థకు సంబంధించిన ప్రాజెక్టులనూ ఈ సంస్థ స్థాపిస్తుంది. తద్వారా పునరుత్పాదక ఇంధనం, సుస్థిర అభివృద్ధిలో రాష్ట్రం అగ్రస్థానం చేరేందుకు తోడ్పడుతుంది.
ఒప్పందంలో భాగంగా.. వ్యూహాత్మక ప్రదేశాల్లో రూ.3 వేల కోట్లతో వేయి మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ వ్యవస్థను స్థాపిస్తుంది. తద్వారా వచ్చే రెండేళ్లలో ప్రత్యక్షంగా వేయి, పరోక్షంగా మూడు వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయి. ప్రాంతీయ ఆర్థిక అభివృద్ధికి బాటలు వేసేలా వికారాబాద్ జిల్లా అనంతగిరిలో ప్రపంచస్థాయి ప్రమాణాలతో రూ.వేయి కోట్లతో వెల్నెస్ రిసార్ట్‌ను మేఘా సంస్థ నెలకొల్పుతుంది. తద్వారా నిర్మాణ దశలో 2 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయి.
వరల్డ్ ఎకనమిక్ ఫోరం సమావేశాల్లో భాగంగా రెండోరోజు జనవరి 21వ తేదీ సీఎం రేవంత్‌రెడ్డి సారథ్యంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం వివిధ కంపెనీల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలతో సమావేశమైంది. మేఘాతో ఒప్పందాలపై మంత్రి శ్రీధర్ బాబు హర్షం వ్యక్తంచేశారు.
Coal Mining: నైనీ బ్లాక్‌లో బొగ్గు ఉత్పత్తి.. 1,600 మెగావాట్ల విద్యుత్ కేంద్రం
మూడు ఒప్పందాలు ఇవే..
మేఘా ఇంజనీరింగ్ ఇండస్ట్రీస్:
- 2160 మెగావాట్ల పంప్‌డ్ స్టోరేజ్ ప్రాజెక్టు: రూ.11 వేల కోట్లు పెట్టుబడిగా ఈ ప్రాజెక్టును మేఘా సంస్థ తెలంగాణలో ఏర్పాటు చేయనుంది. దీని ద్వారా నిర్మాణ దశలో 1000 ఉద్యోగాలు, నిర్వహణ దశలో 250 ఉద్యోగాలు సృష్టించబడతాయి.
- బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్టులు: వ్యూహాత్మక ప్రదేశాల్లో రూ.3 వేల కోట్లతో 1000 మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ వ్యవస్థ స్థాపించబడుతుంది, దీని ద్వారా 2000 ఉద్యోగాలు లభిస్తాయి.
- వెల్నెస్ రిసార్ట్: వికారాబాద్ జిల్లా అనంతగిరిలో రూ.1000 కోట్లతో ప్రపంచస్థాయి ప్రమాణాలతో వెల్నెస్ రిసార్ట్ స్థాపించబడుతుంది. దీనితో 2000 ఉద్యోగాలు వస్తాయి.
‘స్కై రూట్’ రాకెట్ టెక్నాలజీ: తెలంగాణలో ప్రైవేటు రంగంలో రాకెట్ తయారీ, ఇంటిగ్రేషన్ టెస్టింగ్ యూనిట్‌ను స్కై రూట్ సంస్థ రూ.500 కోట్ల పెట్టుబడితో స్థాపించనుంది. ఈ యూనిట్‌ను హైదరాబాదులో ఏర్పాటుచేయడంతో, అంతరిక్ష రంగంలో రాష్ట్రం మరింత ముందుకు నడుస్తుంది.
IT Park: రాజధానిలో రూ.450 కోట్లతో అత్యాధునిక ఐటీ పార్క్
యూనిలీవర్: ఈ సమావేశంలో యూనిలీవర్ సంస్థ తెలంగాణలో వినియోగ వస్తువుల తయారీకి సంబంధించి పెట్టుబడులను పెట్టడానికి ఆసక్తి చూపించింది. కామారెడ్డి జిల్లాలో పామాయిల్ తయారీ యూనిట్, బాటిల్ క్యాప్‌ల తయారీ యూనిట్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ పెట్టుబడులు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు, జాబ్ క్రియేషన్‌కు దోహదం చేయనున్నాయి.
దావోస్‌లో భాగంగా.. 'ఇండస్ట్రీస్ ఇన్ ఇంటెలిజెంట్ ఏజ్' అనే థీమ్‌తో సెమినార్లు, రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించబడుతున్నాయి. ఈ సమావేశంలో రాష్ట్ర బృందం, అమెజాన్, సిఫీ టెక్నాలజీస్, ఇతర సంస్థల ప్రతినిధులతో చర్చలు జరపనుంది.
Global Innovation Hub: నూతన ఆవిష్కరణల కేంద్రంగా ఎదుగుతున్న తెలంగాణ