Skip to main content

PM Internship Applications 2025 : స్టైఫండ్‌తో టాప్‌ కంపెనీల్లో శిక్షణ... పీఎం ఇంటర్నెషిప్‌కు దరఖాస్తులు ఆహ్వానం...

సాక్షి ఎడ్యుకేష‌న్ : పీఎం ఇంటర్నెషిప్ ద్వారా దేశంలోని అగ్రశ్రేణి కంపెనీల్లో... 12 నెలల శిక్షణ పాటు.. శిక్షణ సమయంలో నెలకు రూ.6000 స్టైఫండ్ ఇస్తారు. అలాగే ఇతర సౌకర్యాలు కూడా కల్పిస్తారు.
PM Internship Applications 2025  Internship Stipend Details  PM Internship Stipend Information

దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు వయస్సు 21 నుంచి 24 ఏళ్ల వయస్సు ఉండాలి. అలాగే పదో తరగతి, ఇంటర్మీడియట్‌, ఐటీఐ, డిప్లొమా, బీటెక్, డిగ్రీ పూర్తి చేసిన యువకులు అర్హులు. బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు సైతం అర్హులే. వారు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. 

రిజిస్ట్రేషన్ చేసుకోండిలా..
అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు https://pminternship.mca.gov.in/login/ వెబ్‌సైట్‌లో జ‌న‌వ‌రి 21లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులను ఎంపిక చేసి, వారికి పీఎం ఇంటర్నెషిప్ కింద శిక్షణ ఇస్తారు. ఇంటర్నెషిప్ పూర్తి చేసిన వారికి ఆయా కంపెనీలు ధ్రువీకరణ పత్రం అందజేస్తారు. ఈ ధ్రువీకరణ పత్రం భవిష్యత్తులు ఉద్యోగావకాశాలకు ఉపయోగపడుతుంది. అర్హులైన యువత ప్రధాన మంత్రి ఇంటర్నెషిప్‌కు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి నోటిఫికేషన్ విడుదల అయింది. పూర్తి వివ‌రాల‌కు https://pminternship.mca.gov.in/login/ 
వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

PM Internship Application 2025 Process : 

Published date : 15 Jan 2025 08:07AM
PDF

Photo Stories