Changes in Education Sector : విద్యారంగంలో హైయ్యర్ ఎడ్యుకేషన్ దృష్టి.. ఈ విషయంపై విద్యార్థుల నుంచి అభిప్రాయ సేకరణ..!

సాక్షి ఎడ్యుకషన్: రానున్న రోజుల్లో విద్యారంగంలోని పటిష్టతపై హయ్యర్ ఎడ్యుకేషన్ దృష్టి సారించింది. విద్యార్థులకు రెగ్యులర్ విద్య మాత్రమే కాకుండా ఇతర ప్రోత్సాహకాలు, నైపుణ్యాలు పెంచే వంటి విద్యను అందించాలని ఆశిస్తున్నాట్లు తెలుస్తోంది. ఇప్పుడు విద్యార్థుల్లో వస్తున్న మార్పులు, టెక్నాలజీలో పెరుగుతున్న నైపుణ్యాలు వంటివి చూసాక, విద్యారంగంలో కూడా పలు మార్పులు చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
BRAOU Admissions: అంబేడ్కర్ వర్సిటీ ప్రవేశాలకు నోటిఫికేషన్.. దరఖాస్తు చివరి తేదీ ఇదే..
అయితే, దీనికి సంబంధించి కొత్త సిలబస్ రూపకల్పన చేయాలని విద్యావేత్తలు, పరిశ్రమల నిపుణులు వంటి ప్రముఖులు, అధికారులు విద్యార్థుల నుంచి వారి తల్లిదండ్రుల నుంచి వారి సలహాలు, సూచనలను ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించారు ఉన్నత విద్యామందలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి. ఈ నేపథ్యంలో ఆయన గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు.
ఈ అంశాలపై..
విద్యార్థులంతా www.tgche.ac.in వెబ్‌సైట్‌లో తమ అభిప్రాయాన్ని, సలహాలు, సూచనలు అందించాలని కోరారు. విద్యార్థులు మాత్రమే కాకుండా వారి తల్లిదండ్రులు కూడా వారి అభిప్రాయాన్ని తెలియజేయవచ్చని వివరించారు. టెక్నాలజీ, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్, పరిశ్రమల కోసం పాఠ్యప్రణాళిక పునరుద్ధరణ, ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్స్, ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్, మౌలిక సదుపాయాలు తదితర పాఠ్యాంశాలపై వారి సూచనలు ఇవ్వాలని వివరించారు.
Kaloji University : కాళోజీ యూనివర్సిటీలో విచిత్రం.. ఉలిక్కిపడ్డ విద్యార్థులు..
ప్రస్తుతం, మార్కెట్ అవసరాలకు అనుగుణంగా అండర్ గ్రాడ్యుయేట్ స్థాయిలో పాఠ్యాంశాలు రూపొందించేందుకు కమిటీ ఏర్పాటు చేశామని వెల్లడించారు. త్వరలోనే ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో ఇంటర్న్‌షిప్ ప్రోగ్రాంను అందుబాటులోకి తీసుకురానున్నామని పేర్కొన్నారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- Education Sector
- Higher Education Council
- students and parents opinion
- Telangana schools and colleges
- students education
- education sector changes
- New Subjects
- schools and college students
- ug level subjects
- Internship program
- development of technology and education
- under graduation level
- Graduate level courses
- Education News
- Sakshi Education News