Courses Prohibition : 3 యూనివర్సిటీల్లో 5 ఏళ్లపాటు ఈ కోర్సులు నిషేధం.. కారణం..!
Sakshi Education

సాక్షి ఎడ్యుకేషన్: రాజస్థాన్ రాష్ట్రంలో ప్రమాణాలకు అనుగుణంగా లేని పీహెచ్‌డీ డిగ్రీల కోర్సులను నిర్వహిస్తున్నారని మూడు విశ్వవిద్యాలయాలపై ఆగ్రహం వ్యక్తం చేసింది యూజీసీ.. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్. ఆ మూడు విశ్వవిద్యాలయాలపై మండిపడింది. ఈ నేపథ్యంలోనే ఆ మూడు యూనివర్సిటీల్లోని పీహెచ్‌డీ డిగ్రీ కోర్సులను పూర్తిగా ఐదేళ్లుపాటు నిషేధం విధించింది.
ఈ మాటపై ఇటీవలె, నోటీసులు కూడా జారీ చేసింది యూజీసీ. వచ్చే విద్యా సంవత్సరం నుంచి తమకు ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని తెలిపింది. చురులోని ఓపీజేఎస్, అల్వార్‌లోని సన్‌రైజ్, ఝన్‌ఝునూలోని సింఘానియా యూనివర్సిటీలు ఆఫర్ చేసే పీహెచ్‌డీ ప్రోగ్రామ్స్‌లో చేరొద్దని.. అవి చెల్లవని వర్సిటీలకు యూజీసీ హెచ్చరించింది.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Published date : 17 Jan 2025 04:35PM