UGC Bars Three Universities From PhD Admissions: ఆ కాలేజీలపై నిషేధం విధించిన యూజీసీ.. అందులో ప్రవేశాలు చెల్లవు

రాజస్థాన్‌లోని ఒపీజేఎస్ యూనివర్సిటీ(చురు),సన్‌రైజ్ యూనివర్సిటీ (అల్వార్), సింఘానియా యూనివర్సిటీ (ఝన్‌ఝునూ) లు నిర్వహించే పీహెచ్‌డీ కోర్సులపై యూజీసీ ఐదేళ్లపాటు(2025-26 నుంచి 2029-30 వరకు) నిషేధం విధించింది. 2025-26 విద్యా సంవత్సరం నుంచే తమ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని తెలిపింది. ఈ విశ్వవిద్యాలయాల పీహెచ్‌డీ డిగ్రీలు చెల్లవని, విద్యార్థులు ఈ కాలేజీల్లో చేరవద్దని పేర్కొంది.
NEET PG News: పీజీ వైద్య విద్య నిబంధనల సవరణ సబబే : హైకోర్టు తీర్పు
ప్రవేశ పరీక్ష నిబంధనలు, రీసెర్చ్ అడ్వైసరీ కమిటీ (RAC) ఏర్పాట్లు, థీసిస్ మూల్యాంకన ప్రమాణాలు వంటి మార్గదర్శకాలను ఈ యూనివర్సిటీలు పాటించలేదని తేలింది. యూజీసీ నిబంధనలు పాటించకపోవడం, యూజీపీ లేవనెత్తిన పలు ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పలేకపోవడంతో ఈ మూడు యూనివర్సిటీలపై ఐదేళ్ల పాటు నిషేధం విధిస్తున్నట్లు గురువారం ఆదేశాలు జారీ చేసింది.
విద్యార్థుల కోసం సూచనలు:
చట్టబద్ధమైన విశ్వవిద్యాలయాల జాబితాను UGC అధికారిక వెబ్‌సైట్ లేదా సంబంధిత ప్రభుత్వ వెబ్‌సైట్ ద్వారా ధృవీకరించండి. గుర్తింపు లేని విశ్వవిద్యాలయాల నుండి పొందిన డిగ్రీలు అకాడమిక్ లేదా ప్రొఫెషనల్ విలువ కలిగి ఉండవు. మోసపూరిత సంస్థల పట్ల జాగ్రత్తగా ఉండి, అవగాహన కలిగించండి. జాగ్రత్తగా ఉంటూ భవిష్యత్తుకు నమ్మకమైన నిర్ణయాలు తీసుకోండి!
JEE Main Exam Centers : జేఈఈ పరీక్ష కేంద్రాల కేటాయింపుపై విద్యార్థుల ఆవేదన.. ప్రభుత్వం స్పందించాలని తల్లిదండ్రుల విన్నపం.. కారణం ఇదే..
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- University Grants Commission
- University Grants Commission exam
- The University Grants Commission
- University Grants Commission News
- PhD admissions
- M Jagadesh Kumar
- UGC chairperson M Jagadesh Kumar
- UGC chairperson M Jagadesh Kumar today news
- PhD Programmes
- UGC
- PhD regulations
- university credentials
- Singhania University PhD ban
- UGC action against universities
- Invalid PhD degrees
- UGC strict action