Skip to main content

Engineering Syllabus Changes : ఇంజినీరింగ్‌ సిలబస్‌లో చేయ‌నున్న‌ మార్పులు ఇవే...! ఇంకా..

సాక్షి ఎడ్యుకేష‌న్ : రెండు నెలల్లో ఇంజినీరింగ్‌ సిలబస్‌లో మార్పులు చేయ‌నున్న‌ట్టు తెలంగాణ ఉన్న‌త విద్యా మండ‌లి ఛైర్మన్ ప్రొఫెసర్‌ వి.బాలకిష్టారెడ్డి తెలిపారు.
Telangana Engineering Syllabus Changes

అయితే ఈ కొత్త సిలబస్‌ను ప్రభుత్వ ఆమోదంతో అమలు చేయనున్నామని పేర్కొన్నారు. 

సిల‌బ‌స్ మార్పుకు కార‌ణం ఇదే..

bala krishan reddy

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఇంజినీరింగ్ కాలేజీల‌ నుంచి ప్ర‌తి ఏడాది లక్ష మందికి పైగా విద్యార్థులు బీటెక్ పూర్తిచేసుకోని బయటకు వస్తున్నారు. వీరిలో కేవ‌లం పది శాతం మందికి మాత్రమే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. ఇంజినీరింగ్ ఎడ్యుకేష‌న్‌ సిలబస్‌లో నైపుణ్యాలను పెంచే పాఠ్యాంశాలు లేకపోవడమే ఇందుకు కారణం. అందుకే వచ్చే విద్యాసంవత్సరం నుంచి సిలబస్‌ను సమూలంగా మార్చనున్నాం ప్రొఫెసర్‌ వి.బాలకిష్టారెడ్డి తెలిపారు. కొత్తగా రూపొందించనున్న సిలబస్‌ విదేశీ యూనివ‌ర్శిటీల‌ ప్రమాణాలతో పోటీపడేలా ఉంటుంద‌న్నారు. దీనిపై ఇప్పటికే వందల మంది విద్యావేత్తల సలహాలు, సూచనలు తీసుకున్నాం అన్నారు.

☛➤ JEE Mains 2025 Tips : జేఈఈ మెయిన్స్ ప‌రీక్ష‌లో నెగిటివ్ మార్కింగ్‌.. ఈ 5 టిప్స్‌తో స్ట్రెస్‌ను త‌గ్గించుకోండి..!!

వివిధ రాష్ట్రాల నుంచి 20 మంది వీసీలు, 200 మంది విద్యావేత్తల నుంచి.. విద్యార్థుల్లో నైపుణ్యాల పెంపునకు రూపొందించాల్సిన ప్రమాణాలపై సలహాలు, సూచనలు స్వీకరించాం. వాటన్నింటిని క్రోడీకరించి సిలబస్‌ రూపకల్పనలో వినియోగించుకోనున్నాం. సిలబస్‌లో సమూల మార్పుల ద్వారా విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందించేందుకు చర్యలు తీసుకుంటాం అన్నారు.

 

Published date : 13 Jan 2025 09:07PM

Photo Stories