PG Medical Courses Admissions : పీజీ వైద్య విద్య కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్.. రేపటి నుంచే స్పాట్ అడ్మిషన్స్..

సాక్షి ఎడ్యుకేషన్: వైద్య విద్య కోర్సులో పీజీ సీటు పొందాలనుకుంటున్నారా..! అయితే, కాళోజీ హెల్త్ యూనివర్సిటీలో ఇన్ సర్వీస్ అభ్యర్థులకు పీజీ ప్రవేశాలు కల్పిస్తున్నారు. ఈ మెరకు కాళోజీ హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. దీని కోసం, విద్యార్థులు నీట్ పీజీ-2024లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. పీజీ వైద్య విద్య కోర్సులో ప్రవేశం పొందాలంటే, ప్రవేశ పరీక్షలో ఉన్నత మార్కులు దక్కి ఉండాలి.
MBA Admissions: హెచ్‌సీయూలో ఎంబీఏ సీటుకు చివరి అవకాశం.. చివరి తేది ఇదే..
నీట్ పీజీ 2024 ఉత్తీర్ణులే దరఖాస్తుకు అర్హులని పేర్కొన్నారు. విద్యార్థులు ఈ నెల 23న అంటే, రేపటి నుంచి ఉ.10 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్‌లో ఈ మెరకు స్పాట్ రిజిస్ట్రేషన్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహిస్తుండగా, అర్హత, ఆసక్తి ఉన్నవారు వెంటనే హాజరుకావాలని సూచించింది. కాగా తెలంగాణ బయట ఎంబీబీఎస్ పూర్తి చేసి, 9, 10, ఇంటర్ రాష్ట్రంలో చదివిన వారికే ఈ అవకాశం ఉందని స్పష్టం చేశారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- pg admissions 2025
- neet pg candidates
- online applications for pg medical courses
- Medical students
- ug medical students
- telangana medical pg college
- kaloji health university
- medical courses admissions
- kaloji health university admissions
- medical courses admissions 2025
- MBBS Students
- medical courses at kaloji health university
- Education News
- Sakshi Education News