Half Day Schools Timings : ఒంటిపూట బడుల సమయంలో మార్పులు.. ఇకనుంచి..

సాక్షి ఎడ్యుకేషన్: ఏపీలో పదో తరగతి పరీక్షలు ప్రారంభం అయ్యాయి. ఇక, ఎండల తీవ్రత కారణంగా విద్యార్థులకు ఒంటి పూట బడులను ప్రారంభించారు. ఈమెరకు సమయాన్ని కూడా ప్రకటించగా.. రెండు రోజుల తరువాత ఆ సమయాల్లో స్వల్ప మార్పులు చేసినట్లు ప్రకటించారు అధికారులు. ఇంతకు ముందు మధ్యాహ్నం సమయంలో 1.15 గంటలకు పాఠశాలలు ప్రారంభం కాగా, విద్యార్థులు పరీక్షలు ముగిసి, పరీక్ష పత్రాలు పాఠశాలల బయటకు వెళ్లే వరకు తరగతి విద్యార్థులు బయటే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.
దీంతో, ఎండల్లోనే ఉండాల్సి వస్తుందని అధికారులు ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ఇకనుంచి, ఒక 15 నిమిషాలను పెంచుతూ.. 1.15 గంటలను కాస్త 1.30 చేశారు. అంటే, ఇక నుంచి విద్యార్థులు మధ్యాహ్నం 1.30 గంటలకు ఒంటిపూట బడులు ప్రారంభమై సాయంత్రం 5 గంటల వరకు నడుస్తాయి. ఇక, ఈ మార్పులు కేవలం పదో తరగతి పరీక్షలు జరుగుతున్న పాఠశాలల్లో మాత్రమే. వచ్చే నెల అంటే, ఏప్రిల్ 23వ తేదీ వరకు ఈ ఒంటిపూట బడులు నడవనున్నాయి.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- half day schools
- AP Schools
- students health and education
- minor changes in half day timings
- school timings in ap
- half day schools timings changes
- 15 minutes extension for half day schools
- afternoon schools
- ap govt and privates schools half day timings
- ap tenth board exams
- board exam center schools
- timings changes in board exam center schools
- half day schools timings changes in ap
- Education News
- Sakshi Education News