Skip to main content

Chandrayaan-5 Mission: చంద్రయాన్‌–5 మిషన్‌కు కేంద్ర ప్రభుత్వం ఆమోదం

చంద్రయాన్‌–5 మిషన్‌కు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చైర్మన్‌ వి.నారాయణన్‌ తెలిపారు.
Centre Government has Approved Chandrayaan-5 Mission to the Moon

ఇది 250 కిలోల భారీ రోవర్‌ను చంద్రుడి ఉపరితలంపైకి తీసుకెళ్తుందన్నారు. చంద్రుడి ఉపరితలం, కూర్పుపై సమగ్ర అధ్యయనం ఈ అధునాతన రోవర్‌ లక్ష్యమని ఆయన వెల్లడించారు. చంద్రయాన్‌–5 మిషన్‌కు మూడు రోజుల కిందటే అనుమతి లభించిందని, జపాన్‌ సహకారంతో దీన్ని చేపడతామని తెలిపారు. 

చంద్రయాన్‌ను ఇండియన్‌ లూనార్‌ ఎక్స్‌ప్లోరేషన్‌ ప్రోగ్రామ్‌ అని కూడా పిలుస్తారు. చంద్రుని మీద అన్వేషణ కోసం భారత్‌ చేస్తున్న ఐదో ప్రయోగం ఇది. చంద్రయాన్‌–3 అద్భుత విజయం సాధించింది. 

చంద్రుడి దక్షిణ ధ్రువంపై సాఫ్ట్‌ ల్యాండింగ్‌ చేసిన తొలి దేశంగా భారత్‌ రికార్డు సృష్టించింది. చంద్రయాన్‌–3.. 25 కిలోల రోవర్‌ను తీసుకెళ్లగా, చంద్రయాన్‌–5 మిషన్‌  250 కిలోల బరువున్న రోవర్‌ను తీసుకెళ్లనుంది.  

ఇక 2019లో ప్రయోగించిన చంద్రయాన్‌–2కు చివరిదశలో ఎదురుదెబ్బ తగిలింది.  2027 నాటికి చంద్రయాన్‌–4ను ప్రయోగించాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది. 

☛ Follow our YouTube Channel (Click Here)

☛ Follow our Instagram Page (Click Here)

☛ Join our WhatsApp Channel (Click Here)

☛ Join our Telegram Channel (Click Here)

Published date : 18 Mar 2025 01:05PM

Photo Stories