Skip to main content

Sunita Williams: నింగిలోకి ఫాల్కన్‌.. త్వరలో భూమి మీదకు సునీతా విలియమ్స్!

అంతరిక్షంలో చిక్కుపోయిన భారత సంతతి ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్‌‎ను తీసుకొచ్చేందుకు ముందడుగు పడింది.
NASA-SpaceX Launch Much-Awaited Crew-10 Mission To Bring Sunita Williams, Butch Wilmore Home

ఆమెను అంతరిక్షం నుంచి తిరిగి భూమి పైకి తీసుకొచ్చేందుకు తాజాగా నాసా-స్పేస్‌ ఎక్స్‌లు క్రూ-10 మిషన్‌ను చేపట్టాయి. నలుగురు వ్యోమగాములతో కూడిన ఫాల్కన్ 9 రాకెట్‌ భారత కాలమానం ప్రకారం మార్చి 15వ తేదీ ఉదయం 4.33 గంటలకు కెన్నడీ స్పేస్‌సెంటర్‌ నుంచి నింగిలోకి తీసుకెళ్లింది. 

మూడోసారి రోదసీలోకి వెళ్లి అంతరిక్ష కేంద్రంలోనే చిక్కుకుపోయిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ త్వరలోనే భూమి మీద అడుగు పెట్టబోతున్నారు. 2024 జూన్‌లో‎ ఆస్ట్రోనాట్స్ సునీతా విలియమ్స్, బచ్‌ విల్మోర్, నిక్‌ హేగ్, అలెగ్జాండర్‌ గోర్బునోవ్‌ మిషన్ క్రూ-9 ప్రాజెక్ట్‌లో భాగంగా బోయింగ్‌ స్టార్‌లైనర్‌ రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి వెళ్లారు. 

SpaDeX Satellites: డీ–డాకింగ్‌ సక్సెస్.. తొలి ప్రయత్నంలోనే సఫలమైన ఇస్రో

నాసా షెడ్యూల్ ప్రకారం స్పేస్‌‎లో వీరి పర్యటన వారం రోజులు. కానీ.. వీరు వెళ్లిన బోయింగ్‌ స్టార్‌లైనర్‌‎లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో నిక్‌ హేగ్, అలెగ్జాండర్‌ తిరిగి భూమిపైకి రాగా.. సునీత, బచ్‌ విల్మోర్ అంతరిక్షంలోనే చిక్కుకుపోయారు. దీంతో, దాదాపు తొమ్మిది నెలలుగా సునీతా విలియమ్స్‌, బచ్‌ విల్మోర్ అంతరిక్ష కేంద్రం(ISS)లోనే ఉంటున్నారు. 
 
ఈ క్రమంలో రెండోసారి అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టిన ట్రంప్.. స్పేస్‎లో చిక్కుకుపోయిన ఆస్ట్రోనాట్స్ సునీతా, విల్మోర్‎ను వెంటనే భూమిపైకి తీసుకురావాలని నాసా, ఎలన్ మస్క్‌‎ను ఆదేశించారు. ఈ నేపథ్యంలో వారిని భూమిపైకి తీసుకొచ్చేందుకు మూడు రోజుల క్రితం క్రూ-10 మిషన్‌ను చేపట్టేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే, చివరి నిమిషంలో సాంకేతిక కారణాలతో ఆ ప్రయోగాన్ని నిలిపేశారు. 

తాజాగా వారిని తీసుకొచ్చేందుకు మళ్లీ ప్రయోగం చేపట్టారు. డ్రాగన్‌ క్యాప్సుల్‌లో ఐఎస్‌ఎస్‌కు వెళ్లిన వారిలో అన్నె మెక్లెయిన్‌, నికోల్‌ అయర్స్‌, టకుయా ఒనిషి, కిరిల్‌ పెస్కోవ్‌ వ్యోమగాములు ఉన్నారు. ఇక, మార్చి 19న విలియమ్స్ అంతరిక్షం నుంచి బయల్దేరనున్నారు. వీలైతే మరో వారం రోజుల్లో ఆమె భూమి మీదకు వచ్చే అవకాశం ఉంది.

World's Biggest Iceberg: ఎట్ట‌కేల‌కు ఆగిన ప్రపంచంలోనే అతిపెద్ద మంచుఫ‌ల‌కం

Published date : 15 Mar 2025 01:42PM

Photo Stories