Singareni Schools: సింగరేణి పాఠశాలల్లో ఒలింపియాడ్.. మూడు దశల్లో ఒలింపియాడ్..
దేశంలోని పలు ప్రాంతాల్లో ఒలంపియాడ్ నిర్వహించే సంస్థ ‘యునిఫైడ్ కౌన్సిల్’ ప్రతినిధి కె.శ్రీధర్‌తో కలిసి ఇటీవల ప్రణాళిక రూపొందించారు.
పోటీపరీక్షల్లో విద్యార్థులు ప్రతిభ కనబరిచేలా ఈ విధానం ద్వారా మార్పులు, చేర్పులపై కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే కొత్తగూడెం, భూపాలపల్లి, శ్రీరాంపూర్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో కమిటీని కూడా నియమించారు.
చదవండి: Singareni Education: ప్రైవేట్‌కు దీటుగా ‘సింగరేణి’ విద్య.. ఈ పరీక్షలకు సైతం శిక్షణ..
మూడు దశల్లో...
ప్రస్తుత విధానంలో పాఠాలు బోధించే ఉపాధ్యాయులే పరీక్ష నిర్వహించి వారే దిద్దుతారు. కానీ ఒలింపియాడ్ విధానంలో పాఠాలు చెప్పడం, ప్రశ్నపత్రం తయారుచేయడం, వాల్యూయేషన్ ఇలా మూడు ముగ్గురితో చేయిస్తారు. ఆపై విద్యార్థులు ఏ సబ్జెక్టులో ఏ స్థాయిలో ఉన్నారు, వారిని మరింతగా తీర్చిదిద్దడం ఎలా అనే అంశంపై సమీక్షిస్తారు. ఇలా థర్డ్‌పార్టీ ఆధ్వర్యాన జరిగే ప్రక్రియను కోఆర్డినేటర్లు పరిశీలిస్తుంటారు. కాగా, ఏ పోటీ పరీక్షకై నా కొంత రుసుము చెల్లించాల్సి ఉండడంతో తల్లిదండ్రుల సంసిద్ధతపై ఒలింపియాడ్ విధానం నిర్వహణ ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు.
ఈ విషయమై సింగరేణి ఎడ్యుకేషన్ సొసైటీ సెక్రటరీ గుండా శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులు పోటీపరీక్షల్లో ప్రతిభ చాటేలా తీర్చిదిద్దేందుకు ఒలింపియాడ్ విధానం అమలుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని తెలిపారు.