Harish Rao: ఈ యూనివర్సిటీకి మన్మోహన్ పేరు పెట్టాలి
వీధిదీపాల వెలుగుల్లో చదువుకొనే స్థాయి నుంచి ప్రధాని వరకు ఎదిగిన తీరు మన్మోహన్ గొప్పతనాన్ని చాటుతోందని ఆయన కొనియాడారు. విదేశాల్లో గొప్ప అవకాశాలు లభించినా దేశంపై ప్రేమతో వాటిని తిరస్కరించారని.. పదవులే ఆయనను వరించాయని కీర్తించారు.
ఆర్థిక మంత్రిగా పార్లమెంటులో తొలి ప్రసంగం ఆర్థిక మంత్రుల ప్రసంగాల్లో ఉత్తమమైందిగా నిలిచిపోయిందన్నారు. ఆయన ప్రధానిగా ఉన్న సమయంలో ఎన్నో కుంభకోణాలు వెలుగుచూసినా, వ్యక్తిగా ఆయనకు ఒక్క మచ్చకూడా అంటుకోలేదని చెప్పారు.
కేసీఆర్‌కు షిప్పింగ్ మంత్రిత్వ శాఖ ఇచ్చినప్పుడు డీఎంకే అభ్యంతరం వ్యక్తం చేస్తే కేసీఆరే స్వచ్ఛందంగా ఆ శాఖను వదులుకున్నారని.. ఈ తీరును మన్మోహన్ అభినందించారని హరీశ్‌రావు పేర్కొన్నారు.
కేసీఆర్ పొగడ్తలు ఎందుకు?: పొన్నం అభ్యంతరం
ఈ సమయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ జోక్యం చేసుకొని మన్మోహన్ గురించి మాత్రమే మాట్లాడేందుకే అసెంబ్లీ సమావేశమైందని.. ఇందులో కేసీఆర్ గురించి వర్ణించడం ఎందుకని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. అయినా హరీశ్ తన ప్రసంగంలో కేసీఆర్ ప్రస్తావన తేవడంతో ఇది సరికాదని స్పీకర్ సూచించారు.
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |
మన్మోహన్ సంతాప సభకు హాజరు కావాలని తాను స్వయంగా కేసీఆర్‌కు ఫోన్ చేసి పిలిచినా ఆయన సభకు రాలేదన్నారు. స్పీకర్ వ్యాఖ్యలపై హరీశ్ మండిపడ్డారు. సభ సభలాగా జరగట్లేదని.. కేసీఆర్‌కు సభలో ఏం గౌరవం ఇస్తున్నారని ప్రశ్నించారు.
పీఏసీ చైర్మన్ విషయంలో కేసీఆర్ సూచనను ఎందుకు పట్టించుకోలేదని నిలదీశారు. చివరకు మంత్రి శ్రీధర్‌బాబు జోక్యం చేసుకొని మన్మోహన్ అంశానికే పరిమితమై మాట్లాడాలని హరీశ్‌కు సూచించారు. కాగా, మన్మోహన్‌కు భారతరత్న ప్రకటించడంతోపాటు ఢిల్లీలో పీవీ స్మారకాన్ని ఏర్పాటు చేయాలని బీఆర్‌ఎస్ సభ్యుడు తలసాని కోరగా మన్మోహన్ నిరాడంబర జీవితం గడిపారని బీజేపీ సభ్యుడు వెంకటరమణారెడ్డి కొనియాడారు.