ASCI Hyderabad: ఉపాధి కోర్సులే లక్ష్యం.. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఈ యూజీ కోర్సులు.. కోర్సులు ఇవే..

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా యంగ్ ఇండియా స్కిల్ డెవలప్మెంట్ యూనివ ర్శిటీని ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో స్కిల్ డెవ లప్మెంట్ కోర్సులను కూడా ఎస్కీలో ప్రారంభిం చాలని తలపెట్టామని పేర్కొన్నారు.
అందులో భాగంగా మూడు కోర్సులు అమలు చేస్తున్నామని, అందులో స్కూల్ ఆఫ్ లాజిస్టిక్స్ వేర్ హౌజ్ ఎగ్జిక్యూటివ్స్ అండ్ కీ కన్సైనర్ ఎగ్జిక్యూటివ్స్, అండర్ స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్, ఫార్మసీ అసోసియేట్స్, అండర్ స్కూల్ ఆఫ్ హెల్త్కేర్ నర్స్ కోర్సు వంటి వాటిని ప్రారంభిస్తామన్నారు. గురువారం ఆయన 'సాక్షి'తో పలు విషయాలపై మాట్లాడారు.
చదవండి: Open Degree Exams: ఓపెన్ వర్సిటీ బ్యాక్‌లాగ్ విద్యార్థులకు అవకాశం
పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సులు
ఎస్కీలోని స్కూల్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టడీస్ (ఎస్పీజీఎస్) రెండు పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమో కోర్సులను అమలు చేస్తున్నాం. అందులో ఇన్ఫ్రాస్ట్ర క్చర్ మేనేజ్మెంట్, జనరల్ మేనేజ్మెంట్ కోర్సు లున్నాయి.
ఈ ఏడాది పీజీ డిప్లొమో ఇన్ ఇన్నోవేష న్, ఎంటర్ప్రైన్యూర్షిప్, వెంచర్ డెవలప్మెంట్ కోర్సును అందుబాటులోకి తీసుకొచ్చాం. అలాగే 2025-26 విద్యా సంవత్సరం నుంచి రెండు అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులను అందుబాటులోకి తెస్తు న్నాం. అందులో బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికే షన్స్, బ్యాచులర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ నే కోర్సు లను అందుబాటులోకి తెస్తాం.
చదవండి: NLC Jobs: 10వ తరగతి అర్హతతో ఎన్‌ఎల్‌సీ ఇండియా లిమిటెడ్ లో ఉద్యోగాలు.. నెలకు రూ.38,000 జీతం..
ఉపాధి ఆధారిత కోర్సులు
'ఎస్కీ'లోని 'ఎస్పీజీఎస్'లో ప్రస్తుతం 240 మం ది చదువుకుంటున్నారు. ఈ సంఖ్యను రాబోయే కాలంలో గణనీయంగా పెంచాలనే లక్ష్యంతో పని చేస్తున్నాం. అవసరమైతే కొత్త కోర్సులకు శ్రీకారం చుట్టి ఎక్కువ మంది నాణ్యమైన ఉపాధి అధారిత కోర్సులు ఏర్పాటు చేస్తాం.
ఎస్ పీజీఎస్'లో ప్లేస్మెంట్ల పరిస్థితి ఎలా ఉందంటే..
'ఎస్పీజీఎస్' ఏర్పాటు చేయడమే ఉపాధి కల్పనే లక్ష్యంగా ఏర్పాటు చేసినవే. ప్రస్తుతం ఇందులో చదువుకున్న వారిలో 90 శాతం మంది ఉద్యోగాలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలలో పొందు తున్నారు. మిగతా 10 శాతం వారు సొంతంగా వ్యాపారాలు, పరిశ్రమల అభివృద్ధిపై మరింత దృష్టి పెట్టాం.
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |
జనవరిలో స్నాతకోత్సవం
'ఎస్పీజీఎస్' సాత్నకోత్సవాన్ని 2025 జనవరి 3వ తేదీన నిర్వహించాలని తలపెట్టాం. గవర్నర్ జిష్ణు దేవవర్మను ముఖ్య అతిథిగా పాల్గొనాలని ఆహ్వానిం చాం. ఎస్కీలో స్నాతకోత్సవం నిర్వహించడం దీం తో మూడవ సారి. ఇప్పటికే 2012లో మొదటిసారి, 2015లో రెండవ సారి నిర్వహించాం, పదేళ్ల తర్వాత ప్రస్తుతం నిర్వహించేది మూడవది.
Tags
- Employment Courses
- Administrative Staff College of India
- ASCI
- Skill Development Courses
- Dr G Rameswara Rao
- Young India Skill Development University
- Asci hyderabad fee structure
- ASCI Hyderabad opportunities
- Asci hyderabad courses
- Asci hyderabad courses and fees
- Telangana News
- YoungIndiaSkillDevelopmentUniversity
- VocationalTraining