Skip to main content

Bad News for students: విద్యార్థులకు బ్యాడ్‌న్యూస్‌ పుస్తకాల కిట్లను నిలిపివేసిన రాష్ట్ర ప్రభుత్వం

State government stopping book kits for Anganwadi students  bad news for students  State government stops book kits for students Anganwadi centre with no new book kits provided
bad news for students

వన్ టౌన్(విజయవాడపశ్చిమ): ఆంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారుల భవితను కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. అంగన్వాడీ కేంద్రాలను పునః ప్రారంభించి నెలలు గడుస్తున్నా పాఠ్యపుస్తకాలు అందించకుండా మీనమేషాలు లెక్కిస్తోంది. ఫలితంగా పాత పుస్తకాలతోనే బోధనను కొన సాగించాల్సిన దుస్థితి నెలకొంది.

35 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేష‌న్‌: Click Here

బాల్య దశలో విజ్ఞానం పెంపొందించడంతో పాటు ఆంగ్ల మాధ్యమంలో చిన్నా రులు పట్టు సాధించేలా వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాం లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టిన విషయం విదితమే. 

ఈ క్రమంలో అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు ఆటపాట లతో కూడిన బొమ్మల పుస్తకాలను ప్రభుత్వం అందజేసేది. కూటమి ప్రభుత్వం పాలనా పగ్గాలను చేపట్టాక గత పాల కులు చేపట్టిన సంస్కరణలకు మంగళం పలికింది. చిన్నా రుల భవితను తీర్చిదిద్దే కేంద్రాలను నిర్వీర్యం చేసే దిశగా అడుగులు వేస్తోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. నిలిచిన పాఠ్య పుస్తకాల పంపిణీ అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులకు గత ప్రభుత్వం నాలుగు పుస్తకాలతో కూడిన బర్డ్స్ - 1, కిట్లను అందించింది. వీటి వల్ల ప్రైవేటు, కార్పొరేట్ స్కూల్స్ మాదిరిగా అంగన్ వాడీ కేంద్రాల్లోనూ ఇంగ్లిషులో విద్యాబోధన సాగేది. ఫలితంగా అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారుల సంఖ్య గణనీయంగా పెరిగింది. 

రెండు నుంచి నాలుగేళ్లలోపు చిన్నారులకు ఇంగ్లిషు, గణితం, స్పోకెన్ ఇంగ్లిషు, యాక్టి విటీ డ్రాయింగ్కు సంబంధించిన ఐదు పుస్తకాలతో కూడిన అంగన్వాడీ చిన్నారులకు పాఠాలు చెబుతున్న టీచర్ (ఫైల్) పీపీ-1 కిట్లు అందజేసేవారు. నాలుగేళ్ల నుంచి ఐదేళ్ల వయస్సు కలిగిన చిన్నారులకు ఐదు పుస్తకాలతో కూడిన పీపీ-2 కిట్లను అందించేవారు. కూటమి ప్రభుత్వం పాఠ్య పుస్తకాల పంపిణీని పూర్తిగా నిలిపివేసింది. చిన్నారుల భవితకు ఆటంకం ఎన్టీఆర్ జిల్లాలో ఆరు ఐసీడీఎస్ ప్రాజెక్టులు కొనసాగుతు న్నాయి. వాటి పరిధిలో సుమారు 1,475 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఆయా కేంద్రాలకు నిత్యం 90 వేల మంది చిన్నారుల వరకు వస్తున్నారు. మూడు నుంచి ఆరేళ్ల లోపు వయసు చిన్నారులు సుమారు 12,950 మంది ఉన్న ట్లుగా అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం పాఠ్యపుస్తకాల పంపిణీ లేకపోవడంతో అంగన్వాడీ కేంద్రాల్లో పూర్తి

ప్రీ స్కూల్ విద్యార్థులకు అందించే పుస్తకాలు
ప్రైవేట్ విద్యాసంస్థలను ప్రోత్సహించేందుకే నిర్లక్ష్యం ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలను ప్రోత్సహించేందుకే ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలను నిర్లక్ష్యం చేస్తోందని పలువురు ఆరోపిస్తున్నారు. ప్రధానంగా ప్రైవేట్, కార్పొ రేట్ విద్యాసంస్థలు నిర్వహించే ప్రీ స్కూల్లో వేసిన విద్యార్థులు ఆ తర్వాత అవే విద్యాసంస్థల్లో కొనసాగు తుంటారు. చిన్నారులను అలవాటు చేసేందుకు ప్రీ స్కూ ల్లో చేరుస్తుంటారు. అంగన్వాడీ కేంద్రాలను నిర్లక్ష్యం చేస్తే తద్వారా తల్లిదండ్రులు తమ చిన్నారులను ప్రైవేట్ విద్యాసంస్థల్లో చేర్పించడానికి అవకాశం ఉంటుందని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారని పలువురు వ్యాఖ్యానిస్తు న్నారు. కార్పొరేట్ విద్యాసంస్థల కోసమే వీటిని నిర్లక్ష్యం చేస్తున్నారని తల్లిదండ్రులు మండిపడుతున్నారు.

కొంతమంది వర్కర్లు పాత పుస్తకాలతో బోధన కొనసాగిస్తున్నారు. చిన్నారులకు ఆయా పుస్తకాల్లోని బొమ్మలను చూపించి అర్ధమయ్యే విధంగా వివ రిస్తుంటే వారికి చక్కని విషయ పరిజ్ఞానం పెంపొందించేం దుకు అవకాశం ఉంటుంది. ప్రభుత్వ నిర్లక్ష్యంతో పుస్తకాల పంపిణీ ఆగిపోయి చిన్నారుల భవితకు ఆటంకంగా ఏర్పడిం దని పలువురు చిన్నారుల తల్లిదండ్రులు వాపోతున్నారు.

పుస్తకాలు త్వరలో వస్తాయి
పుస్తకాలు త్వరలో వస్తాయని రాష్ట్రస్థాయి అధికారులు చెప్పారు. పుస్తకాలు వచ్చిన తర్వాత వాటిని పంపిణీ చేస్తాం. ప్రస్తుతం అంగన్వాడీ వర్కర్లు పాత పుస్తకాల ద్వారా బోధనను కొనసాగిస్తు న్నారు. బోధనకు ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం. త్వరలోనే ఆయా సమస్యలు పరిష్కారం అవుతాయి. చిన్నారులకు ఇబ్బం దులు లేకుండా చూస్తున్నాం.-ఉమాదేవి, పీడీ, ఐసీడీఎస్, ఎన్టీఆర్ జిల్లా

Published date : 28 Aug 2024 09:13AM

Photo Stories