Skip to main content

TGPSC Group 1 Mains Hall Ticket : గ్రూప్‌-1 మెయిన్స్‌ హాల్‌టికెట్లు విడుద‌ల‌.. డైరెక్ట్ లింక్ ఇదే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (టీఎస్‌పీఎస్సీ) గ్రూప్‌-1 మెయిన్స్ ప‌రీక్ష‌ల‌కు సంబంధించిన హాల్‌టికెట్లను ఎట్ట‌కేల‌కు విడుద‌ల చేసింది. గ్రూప్‌-1 అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో అవసరమైన వివరాలను అందించి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించింది.
TGPSC Group 1 Mains Hall Ticket Released

ఈ హాల్‌టికెట్లు పరీక్ష తేదీకి ఒకరోజు ముందు వరకు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకునే సమయంలో సమస్యలు తలెత్తితే టోల్ ఫ్రీ నంబర్ లేదా కమిషన్ అధికారులను సంప్రదించాలని పేర్కొంది.

మొత్తం 31,382 మంది అభ్యర్థులు..
TSPSC గ్రూప్ 1 మెయిన్స్‌కు మొత్తం 31,382 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. జూన్ 9వ తేదీన‌ గ్రూప్ 1 ప్రిలిమ్స్‌ పరీక్షను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ఎగ్జామ్ కు మొత్తం 3.02 లక్షల మందికిపైగా అభ్యర్థులు హాజరయ్యారు. గ్రూప్‌-1 మెయిన్స్ పరీక్షను ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూ భాషల్లో నిర్వహిస్తారు. గ్రూప్‌-1 మెయిన్స్ పరీక్షలో జనరల్ ఇంగ్లిష్ తప్ప మిగిలిన పేపర్లను అభ్యర్థులు ఎంచుకున్న భాషల్లో రాయాలి. టీఎస్‌పీఎస్సీ 563 గ్రూప్‌-1 పోస్టుల‌కు నోటిఫికేష‌న్ ఇచ్చిన విష‌యం తెల్సిందే.

☛➤ TGPSC Group 1 Mains Postpone : టీఎస్‌పీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్‌ పరీక్ష రాసే అభ్య‌ర్థులు భ‌యం భయంతో...! ఎందుకంటే..?

గ్రూప్‌-1 ప్రధాన పరీక్షలు హైదరాబాద్‌ కేంద్రంగా (హెచ్‌ఎండీఏ పరిధిలో) మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5గంటల వరకు జరుగుతాయని తెలిపింది. అభ్యర్థులను మధ్యాహ్నం 12:30 నుంచి అనుమతిస్తామని, 1:30 గంటలకు గేట్లు మూసివేస్తామని అధికారులు తెలిపారు. మధ్యాహ్నం 1:30 గంటల తరువాత ఎట్టిపరిస్థితుల్లో అనుమతించబోమని స్పష్టం చేశారు. తొలిరోజు ఉపయోగించిన హాల్‌టికెట్‌తోనే మిగతా పరీక్షలకు రావాలని సూచించారు.

మెయిన్స్ పరీక్షల సమయంలో అభ్యర్థులు పాటించాల్సిన నిబంధనలను కూడా టీజీపీఎస్సీ విడుదల చేసింది. ఎట్టి పరిస్థితుల్లో నిబంధనలను ఉల్లంఘించవద్దని స్పష్టం చేసింది. అభ్యర్థులకు అవగాహన కోసం వెబ్ సైట్ లో మోడల్ ఆన్సర్ బుక్ లెట్లను కూడా ఉంచింది.

టీఎస్‌పీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ ఇదే.. :
☛➤ జనరల్ ఇంగ్లీష్(క్వాలిఫైయింగ్ పేపర్) - అక్టోబర్ 21, 2024.
☛➤ పేపర్-I (జనరల్ ఎస్సే) -అక్టోబర్ 22, 2024.
☛➤ పేపర్-II (చరిత్ర, సంస్కృతి, భూగోళశాస్త్రం) - అక్టోబర్ 23, 2024.
☛➤ పేపర్ -III (ఇండియన్ సొసైటీ, రాజ్యాంగం, అడ్మినిస్ట్రేషన్) - అక్టోబర్ 24, 2024.
☛➤ పేపర్ -IV (ఎకానమీ, డెవలప్మెంట్) - అక్టోబర్ 25, 2024.
☛➤ పేపర్- V (సైన్స్ &సాంకేతికత, డేటా ఇన్టర్ప్రెటేషన్ ) - అక్టోబ్ 26, 2024.
☛➤ పేపర్-VI (తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర నిర్మాణం) - అక్టోబర్ 27, 2024.

టీఎస్‌పీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ లో ఆరు పేపర్లు ఉంటాయి. వీటికి తోడు జనరల్ ఇంగ్లీష్ పేపర్ రాయాల్సి ఉంటుంది. అంటే మెయిన్స్‌లో  భాగంగా ఏడు పేపర్లు రాయాల్సి ఉంటుంది. ప్రతీ పేపర్‌ను 3 గంటల వ్యవధిలో 150 మార్కులకు నిర్వహిస్తారు.

☛➤ TGPSC Group 1 Mains Hall Ticket 2024 కోసం క్లిక్ చేయండి

Published date : 14 Oct 2024 05:35PM

Photo Stories