Skip to main content

TSPSC Group-4 Final Key & Results Date : గ్రూప్‌-4 ఫైనల్ 'కీ' విడుద‌ల‌.. పది రోజుల్లోనే.. అలాగే ఫ‌లితాలు కూడా..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (TSPSC) నిర్వ‌హించిన గ్రూప్‌-4 ఫైన‌ల్ కీ, ఫ‌లితాలు విడుద‌లకి టీఎస్‌పీఎస్సీ కసరత్తు ముమ్మరం చేస్తుంది. జూలై 1న పరీక్ష నిర్వహించిన గ్రూప్‌-4 ప‌రీక్ష‌కు 7,62,872 మంది అభ్యర్థులు హాజరయ్యారు.
 TSPSC Group-4 Exam Results News,Telangana Public Service Commission Update,TSPSC Group 4 Final Key Release News in Telugu,Group IV Examination on July 1
TSPSC Group 4 Final Key and Results

ఆగస్టు 28న ప్రిలిమినరీ ‘కీ’ని టీఎస్‌పీఎస్సీ విడుదల చేసిన విష‌యం తెల్సిందే.

☛➤ TSPSC Group 4 Paper-1 Question Paper With Key 2023 (Click Here)

☛➤ TSPSC Group 4 Paper-2 Question Paper With Key 2023 (Click Here)

ఫ‌లితాలు కూడా అప్పుడే..
ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్‌ 4 వరకు ప్రిలిమినరీ కీపై అభ్యంతరాలు స్వీకరించారు. అభ్యర్థుల నుంచి వచ్చిన అభ్యంతరాలపై నిపుణుల కమిటీ కమిషన్‌కు తుది నివేదిక ఇచ్చినట్టు తెలిసింది. అన్నింటినీ ఒకటికి రెండుసార్లు పరిశీలించిన టీఎస్‌పీఎస్సీ.. పదిరోజుల్లోగా ఈ గ్రూప్‌-4 ఫైనల్ కీ ని విడుద‌ల చేసేందుకు ఏర్పాట్లు చేసినట్టు సమాచారం. అలాగే టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-4 ఫలితాలను కూడా అక్టోబర్‌లో విడుద‌ల చేసే అవ‌కాశం ఉంది. రాష్ట్రంలో 8,180 గ్రూప్‌-4 ఉద్యోగాల భ‌ర్తీ ప్ర‌క్రియ‌కు టీఎస్‌పీఎస్సీ క‌స‌ర‌త్తు చేస్తున్న విష‌యం తెల్సిందే.

ప్ర‌ముఖ స‌బ్జెక్ట్ నిపుణుల ఇచ్చిన మేర‌కు.. టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-4 క‌టాప్ మార్కుల అంచ‌నా ..

Category    Marks
Unreserved (General)  200-225
Other Backward Caste(OBC) 180-200
Scheduled Caste (SC)  150-180
Scheduled Tribe (ST)  140-170

TSPSC గ్రూప్‌-4 కటాఫ్ ..?

Published date : 21 Sep 2023 01:34PM

Photo Stories