Skip to main content

TSPSC Group 4 Results 2023 Date : టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-4 ఫలితాలు విడుదల.. ఎప్పుడంటే..? ఈ మార్కుల ఆధారంగానే ఎంపిక‌..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిషన్ (TSPSC) జూలై 1వ తేదీన నిర్వ‌హించిన గ్రూప్‌-4 రాత ప‌రీక్ష ఫ‌లితాల‌ను వీలైనంత త్వ‌ర‌గా విడుద‌ల చేసేందుకు టీఎస్‌పీఎస్సీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
TSPSC Group 4 Results 2023 Date News Telugu
TSPSC Group 4 Results 2023

 మొత్తం 8,180 ఉద్యోగాలకు రాష్ట్ర వ్యాప్తంగా 9,51,321 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 80 శాతం మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. పేపర్‌-1కు 7,62,872 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇక పేపర్-2కు 7,61,198 మంది అభ్యర్థులు హాజరయ్యారు. జూలై రెండో వారంలో ప్రాథ‌మిక కీ ని అధికారులు విడుద‌ల చేసే అవ‌కాశం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ వెలువడే నాటికి ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తున్నారు.

☛➤ TSPSC Group 4 Paper-1 Question Paper With Key 2023 (Click Here)

ఈ మార్కుల ఆధారంగానే ఎంపిక‌..

tspsc group 4 marks 2023 news telugu

TSPSC Group 4 పోస్టులను భర్తీ చేయడం ద్వారా ప్రభుత్వంపై నిరుద్యోగుల్లో సానుకూల వైఖరి ఏర్పడటానికి అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో గ్రూప్‌-4 ఫ‌లితాల‌ను జూలై నెల చివ‌రికి విడుద‌ల చేసే అవ‌కాశం ఉంది. ఒక వేళ ఈ ఫ‌లితాల విడుద‌ల కొన్ని అనివార్య కారణాల వ‌ల్ల‌ జూలై చివ‌రికి సాధ్య‌ప‌డ‌కపోతే.. ఆగ‌స్టు మొద‌టి వారంలో ఈ గ్రూప్‌-4 ఫ‌లితాల‌ను విడుద‌ల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్న‌ట్టు స‌మాచారం. ఈ గ్రూప్‌-4 ఫలితాల విడుదలలో భాగంగా ఆయా అభ్యర్థులు సాధించిన‌ మార్కులను ప్రకటించనున్నారు. ఈ మార్కుల ఆధారంగా జిల్లాలు, జోన్ల వారీగా పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

☛➤ TSPSC Group 4 Paper-2 Question Paper With Key 2023 (Click Here)

ఈ ప్రక్రియ అంతా ముగియడానికి..

tspsc group 2 exam results news telugu

ప్రస్తుత నోటిఫికేషన్‌లో సుమారు 99 శాఖలకు సంబంధించిన పోస్టులు ఉన్నాయి. ఇందులో జిల్లా, జోనల్‌ స్థాయి ఉద్యోగాలు ఉన్నాయి. వీటిలో ఏ పోస్టుకు ఏ అభ్యర్థి పోటీ పడుతున్నారనే విషయాన్ని వెబ్‌ ఆప్షన్ల ద్వారా నిర్ధారించనున్నారు. ఫలితాలు వెల్లడించిన తర్వాత వెబ్‌ఆప్షన్లకు అవకాశం ఇవ్వనున్నారు. అనంతరం ఆయా పోస్టులకు పోటీపడే అభ్యర్థులను మెరిట్‌ ప్రకారం ఎంపిక చేయనున్నారు. తర్వాత సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ పూర్తిచేసి.. తుది జాబితాను ప్రకటిస్తారు.

☛ TS SI and Constable Final Results 2023 : ఎస్సై, కానిస్టేబుల్ తుది ఎంపిక‌ ఫలితాలు విడుద‌ల‌.. ఎప్పుడంటే..? కటాఫ్‌ మార్కులు మాత్రం..

ఈ ప్రక్రియ ముగియడానికి ఫలితాల ప్రకటన తర్వాత నెల నుంచి 2 నెలల సమయం పట్టే అవకాశముంది. ఎన్నికల షెడ్యూల్‌ నవంబరు లేదా డిసెంబరులో విడుదలయ్యే చాన్స్‌ ఉందని అంచనా వేస్తున్నారు. ఆ లోపు టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-4 పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తి చేసే అవకాశం ఉంది.

☛ TSPSC Group-4 Cut off Marks 2023 : టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-4 క‌టాప్ మార్కులు ఇంతేనా..? ఇన్ని మార్కులు వ‌స్తే.. మీకు ఉద్యోగం వ‌చ్చిన‌ట్టే..?

​​​​​​​​​​​​​​

Published date : 07 Jul 2023 11:13AM

Photo Stories