Contract to Regular : కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చెయ్యాలి!
పార్వతీపురంటౌన్: ఐటీడీఏ పరిధిలోని గురుకుల రెసిడెన్షియల్ పాఠశాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ ఉద్యోగులుగా గుర్తించాలని ప్రభుత్వ కాంట్రాక్ట్ అవుట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్ జేఏసీ జిల్లా కన్వీనర్ బీవీ రమణ డిమాండ్ చేశారు. ఈ మేరకు పార్వతీపురం ఐటీడీఏ వద్ద నిర్వహిస్తున్న దీక్షా శిబిరంలో గురువారం ఆయన పాల్గొని వారికి మద్దతు తెలిపారు.
Students Health : విద్యార్థులకు ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి..
ఈ సందర్భంగా మాట్లాడుతూ గత 15 ఏళ్లుగా ఐటీడీఏ పరిధిలోని గురుకుల పాఠశాలల్లో అతి తక్కువ వేతనంతో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు కనీస వేతనాలు చెల్లించకుండా ఉద్యోగ భద్రత కల్పించకుండా ప్రభుత్వం మోసగించిందని విమర్శించారు. భవిష్యత్తులో తమ ఉద్యోగం రెగ్యులర్ అవుతుందనే ఆశతో పని చేస్తున్న వారి పట్ల ఇంత నిర్లక్ష్యం ప్రదర్శించడం సరైన విధానం కాదన్నారు. వారందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.
Inter Exam Fee 2025: ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లింపు గడువు పొడిగింపు.. చివరి తేదీ ఇదే
మెగా డీఎస్సీలో ప్రస్తుతం వీరు పనిచేస్తున్న స్థానాలను వీరికే రిజర్వ్ చేసి మిగిలిన ఖాళీలను మాత్రమే డీఎస్సీ ద్వారా నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గిరిజన సంక్షేమ సంఘం నాయకుడు పాలక రంజిత్ కుమార్, అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయులు యూనియన్ నాయకులు దివాకర్, రమేష్, వెంకట్ పాల్గొన్నారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)