Skip to main content

Students Health : విద్యార్థుల‌కు ఆరోగ్యం పట్ల జాగ్ర‌త్తలు తీసుకోవాలి..

Care of health should be first before studies

గోపవరం: విద్యార్థులకు చదువుతో పాటు ఆరోగ్యం ముఖ్యమని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ కె.నాగరాజు పేర్కొన్నారు. గురువారం మండలంలోని రాచాయపేట జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో విద్యార్థినీ విద్యార్థులకు వైద్యపరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డీఎంహెచ్‌ఓ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్తహీనత వలన జరిగే ఇబ్బందుల గురించి వివరించారు.

YVU Semester Exams : నేటి నుంచి వైవీయూ ప‌రిధిలో డిగ్రీ సెమిస్ట‌ర్ ప‌రీక్ష‌లు..

విద్యార్థులు భోజనానికి ముందు చేతులు శుభ్రపరుచుకోవాలన్నారు. పోషక పదార్థాలు తీసుకోవడం వలన ఆరోగ్యంగా ఉంటారని, అప్పుడే చదువుపై కూడా ధ్యాస కలుగుతుందని సూచించారు. ముఖ్యంగా తల్లిదండ్రులు కూడా పిల్లల ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. మండల వైద్యాధికారులు మహేశ్వర్‌రెడ్డి, మురళీకృష్ణలు విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ బాలబాలికల సంరక్షణ అధికారి రమేష్‌, సీహెచ్‌ఓ గౌస్‌ పాల్గొన్నారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 29 Nov 2024 03:49PM

Photo Stories