Skip to main content

Sheikh Saleema, IPS: తెలంగాణ‌లోనే తొలి ముస్లిం మహిళా ఐపీఎస్‌గా షేక్‌ సలీమా

ఖమ్మం జిల్లాకు చెందిన షేక్‌ సలీమా తెలంగాణ‌లోనే తొలి ముస్లిం మహిళా ఐపీఎస్‌గా రికార్డులకెక్కారు.
Sheikh Saleema, IPS
Sheikh Saleema, IPS

కేంద్రం డిసెంబ‌ర్ 21వ తేదీన‌ విడుదల చేసిన నాన్‌ కేడర్‌ ఐపీఎస్‌ల పదోన్నతి జాబితాలో ఆమెకు స్థానం దక్కింది. 

కుటుంబ నేప‌థ్యం :  
చింతకాని మండలం కోమట్లగూడెంకు చెందిన లాల్‌ బహదూర్, యాకూబీ దంపతుల కూతురు సలీమా. తండ్రి ఖమ్మంలో ఎస్సైగా పనిచేసి రిటైర్‌ అయ్యారు.సలీమాకు ఇద్దరు చెల్లెళ్లు, తమ్ముడు.  ఒక సోదరి జరీనా ఇటీవల ఏపీలో గ్రూప్‌–1 పరీక్ష రాసి మెయిన్స్‌కు ఎంపికయ్యారు. ఇంటర్వ్యూలో అర్హత సాధిస్తే ఆమె కూడా ప్రభుత్వ సర్వీసుకు ఎంపికవుతారు. మరో చెల్లెలు మున్నీ ఖైరతాబాద్‌ ఎంవీఐగా పనిచేస్తున్నారు. తమ్ముడు ఖాసిం హైదరాబాద్‌ కేర్‌ హాస్పిటల్‌లో డాక్టర్‌గా స్థిరపడ్డారు. సలీమా భర్త కూడా సాఫ్ట్‌వేర్‌ రంగంలో ఉన్నారు. 

గ్రూప్‌–1లో..
సలీమా కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి బయో టెక్నాలజీలో ఎమ్మెస్సీ చేశారు. 2007లో గ్రూప్‌–1లో డీఎస్పీగా ఎంపికయ్యారు. ఆదిలాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌లో తొలి పోస్టింగ్‌ పొందిన ఆమె అంబర్‌పేట పీటీసీ వైస్‌ ప్రిన్సిపాల్‌గా, మాదాపూర్‌లో అదనపు కమిషనర్‌(అడ్మిన్‌)గా పనిచేసి ప్రస్తుతం రాచకొండ కమిషనరేట్‌లో డీసీపీగా ఉన్నారు.

Published date : 23 Dec 2021 12:36PM

Photo Stories