Shubhanshu Shukla: డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్ పైలట్‌గా శుభాంశు శుక్లా

స్పేస్‌ఎక్స్ సంస్థ అభివృద్ధి చేసిన డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్‌కు పైలట్‌గా వ్యవహరించబోతున్నాడు. ఇందుకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా అనుమతి మంజూరు చేసింది. యాక్సి యోమ్–4 మిషన్‌లో భాగంగా నలుగురు ప్రైవేట్ వ్యోమగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకోనున్నారు.
14 రోజుల తర్వాత తిరిగి వస్తారు. ప్రయోగంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) సైతం భాగస్వా మిగా మారింది. డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్‌కు నాసా మాజీ వ్యోమగామి పెగ్గీ విట్సన్ సారథ్యం వహించనున్నాడు. పోలాండ్‌కు చెందిన ఉజ్‌నాన్‌స్కీ, హంగేరీకి చెందిన టిబో ర్ కపూ సైతం ఇందులో పాలుపంచుకుంటున్నారు.
మొత్తం నలుగురు అస్ట్రోనాట్స్ డ్రాగన్ అంతరిక్ష నౌకలో ఐఎస్‌ఎస్‌కు చేరుకుంటారు. త్వరలో ఈ ప్రయోగం చేపట్టడానికి ఏర్పాట్లు పూర్త య్యాయి. శుభాంశు శుక్లా ప్రస్తుతం భారత వైమానిక దళంలో గ్రూప్ కెప్టెన్‌గా పనిచేస్తున్నాడు. యాక్సియోమ్–4 మిషన్‌కు ఎంపికయ్యాడు. నాసాతో పాటు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, జపాన్ ఏరో స్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ ఏజెన్సీలో శిక్షణ పొందాడు.
Mount Aconcagua: దక్షిణ అమెరికా అత్యున్నత శిఖరం 'అకోన్‌కాగ్వా'పై భావన