Dolphins: యూపీ, బిహార్‌లోనే డాల్ఫిన్లు ఎక్కువ
Sakshi Education
భారతదేశంలోని నదుల్లో మొత్తం 6,327 డాల్ఫిన్‌లు ఉన్నాయి.

ఇందులో గంగానది, దాని ఉపనదుల్లో 5,689 ఉంటే.. బ్రహ్మపుత్ర, దాని ఉపనదులు, బియాస్ నదుల్లో మిగతావి ఉన్నాయి. ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ జాతీయ వన్యప్రాణి మండలి సమావేశంలో డాల్ఫిన్లపై ఒక నివేదిక విడుదల చేశారు.
మనదేశంలో ఇలాంటి నివేదిక ఇదే మొదటిసారి. దేశంలోని 8 రాష్ట్రాల్లోని 28 నదుల్లో సర్వే చేసి దీన్ని రూపొందించారు. అత్యధిక డాల్ఫిన్లు యూపీ, బిహార్ లలోని నదుల్లో ఉన్నాయి.
రాష్ట్రం | డాల్ఫిన్ల సంఖ్య |
---|---|
యూపీ | 2,397 |
బిహార్ | 2,220 |
పశ్చిమ బెంగాల్ | 815 |
అస్సాం | 635 |
ఝార్ఖండ్ | 162 |
రాజస్తాన్, మధ్యప్రదేశ్ | 162 |
పంజాబ్ | 95 |
Blume Ventures Report: దేశంలో పెరుగుతున్న ధనికుల సంపద, పేదల సంఖ్య!!
Published date : 06 Mar 2025 08:59AM