Skip to main content

US President Donald Trump : ట్రంప్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. యూఎస్‌ సీక్రెట్‌ సర్వీస్‌ గౌరవ ఏజెంట్‌గా..

Trump presents 13yr old as secret service agent in america

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. టెక్సాస్‌కు చెందిన 13 ఏళ్ల బాలుడు, క్యాన్సర్‌ విజేత డీజే డేనియల్‌ను సీక్రెట్‌ సర్వీస్‌ గౌరవ ఏజెంట్‌గా నియమించారు. కాంగ్రెస్‌ తొలి సంయుక్త సమావేశంలో డీజే విజయగాథను ట్రంప్‌ పంచుకున్నారు. ‘2018లో డీజేకు అరుదైన కేన్సర్‌ నిర్ధారణ అయ్యింది. ఐదు నెలలే బతు కుతాడని డాక్టర్లు చెప్పారు.

Donald Trump: ఉక్రెయిన్కు షాకిచ్చిన డొనాల్డ్ ట్రంప్.. సైనిక సాయం బంద్

అరుదైన గౌర‌వం..

పోలీసు ఆఫీసర్‌ కావాలన్న లక్ష్యం ఆయనకు పోరాడే స్థైర్యాన్నిచ్చింది. కేన్సర్‌ను ఓడించిన డీజే తన కలను నిజం చేసుకోబోతున్నాడు. అతనికి పెద్ద గౌరవాన్ని ఇస్తున్నా. డీజేను యూఎస్‌ సీక్రెట్‌ సర్వీస్‌ గౌరవ ఏజెంట్‌గా చేయాలని డైరెక్టర్‌ సీన్‌ కరన్‌ను అడుగుతున్నా’ అని ప్రకటించారు. దీంతో సభంతా చప్పట్లతో హోరెత్తింది. సభ మొత్తం ‘డీజే... డీజే’ అని హోరెత్తగా గ్యాలరీలో అతని తండ్రి డీజేను గాల్లోకి ఎత్తాడు. సీక్రెట్‌ సర్వీస్‌ డైరెక్టర్‌ కరన్‌ ఆ బాలుడి దగ్గరకు వెళ్లి అధికారిక బ్యాడ్జీని అందజేశారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 06 Mar 2025 11:55AM

Photo Stories