Shaktikanta Das: ప్రధాని మోదీ ముఖ్య కార్యదర్శిగా శక్తికాంత దాస్

శక్తికాంత్ దాస్.. ప్రధాని మోదీ ప్రిన్సిపల్ సెక‍్రటరీ2గా నియమించడానికి క్యాబినెట్ కమిటీ ఆమోద ముద్ర వేసింది. ఈ మేరకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ ఫిబ్రవరి 22వ తేదీ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం పీకే మిశ్రా సెప్టెంబర్ 11, 2019 నుంచి ప్రధానమంత్రికి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు. వీరిద్దరూ ప్రధానమంత్రి కార్యాలయ పరిపాలనా వ్యవహారాలను చూస్తారు.
ఆర్‌బీఐ గవర్నర్‌గా సేవలందించిన శక్తికాంత్ దాస్.. గతేడాది డిసెంబర్ రెండో వారంలో తన పదవికి వీడ్కోలు పలికారు. 2018 నుంచి ఆయన ఆర్బీఐ గవర్నర్‌గా ఉన్నారు. ఆర్బీఐ గవర్నర్‌గా ఉర్జిత్ పటేల్ హఠాత్తుగా వైదొలిన క్రమంలో ఆ బాధ్యతల్ని శక్తికాంత్ దాస్ చేపట్టారు.
1980 తమిళనాడు క్యాడర్ కు ఐఏఎస్ అధికారి అయిన శక్తికాంత్ దాస్.. ఢిల్లీ సెయింట్ స్టెఫెన్స్ కాలేజ్ నుంచి మాస్టర్ డిగ్రీ చేశారు. అనంతరం బర్మింగమ్ యూనివర్శిటీ నుంచి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో పీజీ పూర్తి చేశారు. 2016లో మోదీ ప్రభుత్వం ‘పెద్ద నోట్ల రద్దు’ చేస్తూ నిర్ణయం తీసుకున్న సందర్భంలో ఆయన ఎకానామిక్ అఫైర్స్ సెక్రటరీగా ఉన్నారు.