Union Budget 2025 Live Updates: కేంద్ర బడ్జెట్ ముఖ్యాంశాలు.. అప్‌డేట్స్ ఇవే..

కేంద్ర బడ్జెట్ సమావేశాల అప్‌డేట్స్ ఇవే..
ఈ బడ్జెట్‌లో కొన్ని ముఖ్యమైన అంశాలు..
- ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు గుడ్‌న్యూస్ - కొత్త పన్ను విధానంలో 12 లక్షల వరకు పన్ను సున్నా.
- వృద్ధులకు వడ్డీపై టీసీఎస్ ఊరట - వృద్ధులకు పన్ను భారం తగ్గింపు.
- 36 ఔషధాలకు బేసిక్ కస్టమ్స్ డ్యూటీ తొలగింపు - ఔషధాల ధరలు తగ్గవచ్చు.
- బీమా రంగంలో ఎఫ్‌డీఐ 100 శాతానికి పెంపు - బీమా రంగంలో పెట్టుబడులు పెరుగుదల.
- ఇన్‌కమ్ ట్యాక్స్ బిల్లు - వచ్చే వారం కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ బిల్లు ప్రవేశపెట్టే అవకాశం.
- గిగ్ వర్కర్లకు ఆరోగ్య బీమా - గిగ్ వర్కర్లకు ఆరోగ్య బీమా కల్పన.
- కిసాన్ క్రెడిట్ కార్డుల పరిమితి రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంపు - రైతుల కోసం మరింత క్రెడిట్ సౌకర్యం.
త్వరలో ఆదాయపు పన్ను సరళీకరణ
బడ్జెట్‌లో ఆదాయపన్ను రేట్ శ్లాబ్‌లతో ప్రభుత్వం ప్రజల చేతుల్లో నగదును ఉంచింది.
బడ్జెట్ ప్రకటన తర్వాత 1 కోటి మంది ప్రజలు ఎటువంటి పన్ను చెల్లించబోరు.
త్వరలో ఆదాయపు పన్ను సరళీకరిస్తాం.
ప్రతి వేతన జీవికి రేట్లు తగ్గిస్తున్నాం
ఏటా రూ.12 లక్షలు సంపాదించే వారికి కేవలం రాయితీ మాత్రమే కాదు. ప్రతి వేతన జీవికి రేట్లు తగ్గిస్తున్నాం.
ఆదాయంపై రాయితీ క్రమంగా పెరిగింది. ఎవరైనా నెలకు రూ.1 లక్ష సంపాదించేవారికి కూడా పన్ను రాయితీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
బడ్జెట్‌పై నిర్మలా సీతారామన్ ప్రెస్ మీట్
- కొత్త ట్యాక్స్ విధానం పాటించే వారికి మాత్రమే మినహాయింపులు
- బలమైన ఆర్థిక శక్తిగా అడుగులు వేస్తున్నాం.
- వికసిత భారత్‌కు ఈ బడ్జెట్ బాటలు వేస్తుంది.
- ఈ బడ్జెట్‌లో గ్రామీణాభివృద్ధికి, వ్యవసాయానికి ప్రాధాన్యత ఇచ్చాం.
- కోవిడ్ తర్వాత వ్యవసాయ రంగం మళ్లీ పుంజుకుంది.
- భారత్ ప్రపంచ ఆహార ధాన్యాగారంగా మారుతుంది.
- 6 రంగాలకు ప్రాధాన్యత ఇచ్చాం.
- ఆదాయపన్నులో సంస్కరణలు తీసుకొచ్చాం.
- మూలధన వ్యయంలో ఎలాంటి తగ్గింపు లేదు.
- రూ.12 లక్షల లోపు ఆదాయం ఉన్న ఉద్యోగులకు ఊరట కల్పించాం
బడ్జెట్ 2025-26 సమగ్ర స్వరూపం
- రెవెన్యూ వసూళ్లు రూ.34,20,409 కోట్లు
- పన్ను వసూళ్లు రూ.28,37,409 కోట్లు
- పన్నేతర వసూళ్లు రూ.5,83,000 కోట్లు
- మూలధన వసూళ్లు రూ.16,44,936 కోట్లు
- రుణాల రికవరీ రూ.29,000 కోట్లు
- ఇతర వసూళ్లు రూ.47,000 కోట్లు
- అప్పులు, ఇతర వసూళ్లు రూ.15,68,936 కోట్లు
- మొత్తం ఆదాయం రూ.50,65,345 కోట్లు
- మొత్తం వ్యయం రూ.50,65,345 కోట్లు
- రెవెన్యూ ఖాతా రూ.39,44,255 కోట్లు
- వడ్డీ చెల్లింపులు రూ.12,76,338 కోట్లు
- మూలధన ఆస్తుల కోసం కేటాయించిన గ్రాంట్లు రూ.4,27,192 కోట్లు
- మూలధన ఖాతా రూ.11,21,090 కోట్లు
- వాస్తవ మూలధన వ్యయం రూ.15,48,282 కోట్లు
- రెవెన్యూ లోటు రూ.5,23,846 కోట్లు
- నికర రెవెన్యూ లోటు రూ.96,654 కోట్లు
- ద్రవ్య లోటు రూ.15,68,936 కోట్లు
- ప్రాథమిక లోటు రూ.2,92,598 కోట్లు
రూ.50,65,345 కోట్ల కేంద్ర బడ్జెట్
రూపాయి రాక...
- ఇన్‌కమ్ ట్యాక్స్ 22 పైసలు
- ఎక్సైజ్ డ్యూటీ 5 పైసలు
- అప్పులు, ఆస్తులు 24 పైసలు
- పన్నేతర ఆదాయం 9 పైసలు
- మూలధన రశీదులు 1 పైసలు
- కస్టమ్స్ ఆదాయం 4 పైసలు
- కార్పొరేషన్ ట్యాక్స్ 17 పైసలు
- జీఎస్టీ, ఇతర పన్నులు 18 పైసలు
రూపాయి పోక..
- పెన్షన్లు 4 పైసలు
- వడ్డీ చెల్లింపులు 20 పైసలు
- కేంద్ర పథకాలు 16 పైసలు
- ప్రధాన సబ్సిడీలు 6 పైసలు
- డిఫెన్స్ 8 పైసలు
- రాష్ట్రాలకు తిరిగి చెల్లించే ట్యాక్స్‌లు 22 పైసలు
- ఫైనాన్స్ కమిషన్‌కు చెల్లింపులు 8 పైసలు
- కేంద్ర ప్రాయోజిక పథకాలు 8 పైసలు
- ఇతర కేంద్ర ప్రాయోజిత పథకాలు, ఖర్చులు 8 పైసలు
ఈ బడ్జెట్‌లో రంగాల వారీగా కేటాయింపులు ఇలా..
- రక్షణశాఖ – రూ.4,91,732 కోట్లు
- గ్రామీణాభివృద్ధి – రూ.2,66,817 కోట్లు
- హోంశాఖ – రూ.2,33,211 కోట్లు
- వ్యవసాయం, అనుబంధ రంగాలు – రూ.1,71,437 కోట్లు
- విద్య – రూ.1,28,650 కోట్లు
- ఆరోగ్యం – రూ.98,311 కోట్లు
- పట్టణాభివృద్ధి – రూ.96,777 కోట్లు
- ఐటీ, టెలికాం – రూ.95,298 కోట్లు
- విద్యుత్ – రూ.81,174 కోట్లు
- వాణిజ్యం, పరిశ్రమలు – రూ.65,553 కోట్లు
- సామాజిక సంక్షేమం – రూ.60,052 కోట్లు
ధరలు పెరిగేవి వీటికే..
- ఫ్లాట్ ప్యానెల్ డిస్‌ప్లే
- సిగరెట్లు
ధరలు తగ్గేవి వీటికే..
- ఎలక్ట్రిక్ వెహికల్స్
- ఎల్ఈడీ టీవీలు
- సెల్‌ఫోన్స్
- క్యాన్సర్ మేడిసిన్స్
- లిథియం అయాన్ బ్యాటరీలు
- లెదర్ వస్తువులు
ముగిసిన బడ్జెట్ ప్రసంగం
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం దాదాపు 75 నిమిషాల పాటు కొనసాగి ముగిసింది.
సమయం: 12:18PM
రూ. 12 లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు
- మధ్యతరగతికి భారీ ఊరట
- స్మాల్ ట్యాక్స్ పేయర్స్ టీడీఎస్ రిలీఫ్
- రూ. 12 లక్షల ఆదాయం వరకు పన్ను మినహాయింపు
- కొత్త ట్యాక్స్ రెజ్యూమ్‌లో రూ. 12 లక్షల వరకూ పన్ను లేదు
సమయం: 12:22 PM
TDSపై మరింత క్లారిటీ
- BNS స్పూర్తితో కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ బిల్లు తీసుకొస్తాం
- లిటిగేషన్లను తగ్గించేలా ఇన్‌కమ్ ట్యాక్స్ విధానం
- మిడిల్ క్లాస్ ప్రజలను దృష్టిలో ఉంచుకుని వ్యక్తిగత పన్ను విధానం
- సీనియర్ సిటిజన్లకు TDS మినహాయింపు రూ.50 వేల నుంచి రూ.1 లక్షకు పెంపు
- అప్‌డేటెడ్ ఇన్‌కమ్ ట్యాక్స్ నమోదుకు నాలుగేళ్లు పొడిగింపు
సమయం: 12:12 PM
ఇన్సూరెన్స్ రంగంలో వందశాతం FDIలకు అనుమతి
- ఇన్సూరెన్స్ రంగంలో వందశాతం FDIలకు అనుమతి
- ప్రీమియం మొత్తాన్ని దేశంలోనే పెట్టుబడి పెట్టే విదేశీ సంస్థలకు అనుమతి
- BNS స్పూర్తితో కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ బిల్లు తీసుకొస్తాం
- లిటిగేషన్లను తగ్గించేలా ఇన్‌కమ్ ట్యాక్స్ విధానం
సమయం: 12:06 PM
వృద్ధులకు టీడీఎస్ ఊరట
- వడ్డీపై వచ్చే ఆదాయంపై రూ.50 వేల నుంచి రూ.లక్షకు పెంపు
- అద్దె ద్వారా వచ్చే ఆదాయంపై 2.4 లక్షల నుంచి రూ.6 లక్షలకు పెంపు
★ జ్ఞాన భారత మిషన్ ఏర్పాటుకు.. ఐఐటీ, ఐఐఎస్ విద్యార్థులకు రూ.10 వేల కోట్ల ఉపకార వేతనాలు
సమయం: 12:03 PM
ఉడాన్ పథకం
- మరో 120 రూట్లలో ఉడాన్ పథకం
- ఈవీ బ్యాటరీ పరిశ్రమలకు ప్రోత్సాహకాల కోసం క్లీన్‌టెక్ మిషన్
- పర్యాటక ప్రదేశాల్లో మెరుగైన రవాణా సదుపాయాలు
- రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి 22 పర్యాటక ప్రాంతాల అభివృద్ధి
'వికాస్ భారత్'లో జీరో పేదరికం
- విద్యారంగంలో ఏఐ వినియోగం
- ఐదేళ్లలో అదనంగా 75 వేల మెడికల్ సీట్లు
- బిహార్‌లో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ
- పదేళ్లలో ఐఐటీల్లో విద్యార్థుల సంఖ్య రెట్టింపు
- 50 వేల ప్రభుత్వ పాఠశాలల్లో అటల్ తింకరింగ్ ల్యాబ్స్
- అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ శిక్షణ కోసం ఏర్పాట్లు
జల్ జీవన్ మిషన్‌కు మరిన్ని నిధులు.
- ఈ పథకం కింద 15 కోట్ల మందికి రక్షిత మంచినీరు అందించామని.. రాష్ట్రాలు, యూటీలతో ఒప్పందం ద్వారా 100 శాతం మంచినీటి కుళాయిలు ఉన్నాయని చెప్పిన నిర్మలా.
- కృత్రిమ మేధ అభివృద్ధికి రూ.500 కోట్లతో మూడు ప్రత్యేక కేంద్రాలు
సమయం: 11:46 AM

లోన్లు రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంపు
- KCC ద్వారా లోన్లు రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంపు
- రూ.30వేలతో స్ట్రీట్ వెండర్స్‌కు క్రెడిట్ కార్డులు
- బొమ్మల తయారీకి ప్రత్యేక పథకం
- ఐఐటీ పాట్నా విస్తరణకు నిర్ణయం
- రాష్ట్రాలకు రూ.1.5 లక్షల కోట్లు కోట్ల రుణాలు
మూలధన వ్యయాల కోసం
50 ఏళ్లకు వడ్డీ రహిత రుణాలు
సంస్కరణల అమలు చేస్తే ప్రోత్సాహకాలు - గిగ్ వర్కర్లకు ఆరోగ్య బీమా
గిగ్ వర్కర్లకు గుర్తింపు కార్డులు
ఈ-శ్రమ్ పోర్టల్ కింద నమోదు
పీఎం జన్ ఆరోగ్య యోజన కింద ఆరోగ్య బీమా కల్పన
కోటి మంది గిగ్ వర్కర్లకు ప్రయోజనం
సమయం: 11:35 AM
పీఎం ధన్‌ధాన్య యోజన
- MSME రంగంలో 7.5 కోట్లమంది కార్మికులు
- ఎస్సీ, ఎస్టీ మహిళల కోసం ప్రత్యేక పథకం
- ఈశాన్య రాష్ట్రాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమకు ప్రోత్సాహం
- నేషనల్ మాన్యుఫ్యాక్షరింగ్ బోర్డు ఏర్పాటు
- పప్పు ధాన్యాల కోసం ఆరు సంవత్సరాల ప్రణాళిక
- ప్రయోగాత్మకంగా 10 జిల్లాల్లో పీఎం 'ధన్‌ధాన్య' యోజన
- బిహార్‌లో మఖనా రైతుల కోసం ప్రత్యేక బోర్డు
- మఖనా ఉత్పత్తి పెంచేలా బోర్డు ద్వారా శిక్షణ
- ట్యాక్సేషన్, మైనింగ్,
- అన్ని స్కూళ్లకు బ్రాండ్ బ్యాండ్ సేవలు
- పదేళ్లలో ఐఐటీ విద్యార్థుల సంఖ్య రెట్టింపు
- పత్తి ఉత్పాదక పెంచేందుకు స్పెషల్ ప్రోగ్రామ్
- ఐఐటీ పాట్నా విస్తరణకు నిర్ణయం
- అంగన్‌వాడీలకు కొత్త హంగులు
- విద్యారంగంలో ఏఐ వినియోగం
- ఐదేళ్లలో అదనంగా 75 వేల సీట్లు
సమయం: 11:30 AM
మన సంస్కరణలపై ప్రపంచం దృష్టి
- మన సంస్కరణలపై ప్రపంచం దృష్టి
- అధిక వృద్ధిరేటు సాధిస్తున్న దేశాల్లో భారత్ ఒకటి
- సున్నా శాతం పేదరికమే లక్ష్యంగా బడ్జెట్
- ఆరు రంగాల్లో సమూల మార్పులు
- 1.7 కోట్ల మంది రైతులకు ప్రయోజనం
- వికాస్ భారత్‌తో జీరో పేదరికం
- 2025-26లో జీడీపీ వృద్ధి 6.3 శాతం నుంచి 6.8 శాతం
- సబ్ కా వికాస్‌కు వచ్చే ఐదేళ్లు సువర్ణావకాశం
- మన సంస్కరణలపై ప్రపంచం దృష్టి
- వికాస్ భారత్‌లో మెరుగైన ఆరోగ్య సంరక్షణ
- ఆర్థిక కార్యకలాపాల్లో 70 శాతం మహిళలు
సమయం: 11:19 AM
వికసిత్ భారత్ లక్ష్యం దిశగా
- వికసిత్ భారత్ లక్ష్యం దిశగా ముందుకు వెళ్తున్నాం.
- విపక్షాల నినాదాల మధ్యనే బడ్జెట్ ప్రసంగం ప్రారంభించిన నిర్మలా సీతారామన్.
- ది పవర్ ఆఫ్ రైజింగ్ మిడిల్ క్లాస్ పేరుతో బడ్జెట్.
- ఇన్‌ఫ్రా, మధ్య తరగతి ప్రజల వికాసమే లక్ష్యంగా ఐదేళ్ల ప్రణాళిక.
సమయం: 11:08 AM
ప్రారంభమైన బడ్జెట్ ప్రసంగం
- 2025 బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు.
- శనివారం ఉదయం 11 గంటలకు లోక్‌సభలో కేంద్ర పద్దును ప్రవేశపెట్టి ప్రసంగిస్తున్నారు.
- అంతకుముందు బడ్జెట్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
- వరుసగా ఎనిమిదోసారి కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడుతూ రికార్డు నెలకొల్పిన నిర్మలమ్మ.
సమయం: 11:06 AM
బడ్జెట్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం
- బడ్జెట్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం.. మరి కాసేపట్లో ప్రారంభం కానున్న బడ్జెట్
కేంద్ర క్యాబినెట్ భేటీ ముగిసింది. బడ్జెట్‌కు ఆమోదం తెలిపిన కేంద్ర క్యాబినెట్. కాసేపట్లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్
సమయం: 10:52 AM
★ పార్లమెంటుకు చేరుకున్న కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్
2025-02-01 10:47:57
త్వరలో బడ్జెట్‌ను ఆమోదించనున్న కేంద్ర కేబినెట్
- మోడీ 3.0 పూర్తికాల బడ్జెట్‌కు త్వరలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రి మండలి ఆమోదం లభించనుంది.
- సీతారామన్ ఈరోజు పార్లమెంట్‌లో కేంద్ర బడ్జెట్ 2025ను సమర్పించనున్నారు. ఆమె వరుసగా ఎనిమిదోసారి బడ్జెట్‌ను విడుదల చేస్తూ రికార్డు సృష్టించారు.
- అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వ హయాంలో ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా సాయంత్రం 5 గంటలకు బదులుగా మొదటిసారి ఉదయం 11 గంటలకు బడ్జెట్ ప్రవేశపెట్టారు. దాంతో అదే సంప్రదాయం కొనసాగుతోంది.
సమయం: 10:27 AM
- బడ్జెట్ 2025-26 పత్రాలను ‘యూనియన్ బడ్జెట్’ మొబైల్ యాప్ ఉపయోగించి పొందవచ్చు. ఈ యాప్‌ను ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫామ్‌ల్లో లేదా యూనియన్ బడ్జెట్ వెబ్ పోర్టల్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ పత్రాలు ఇంగ్లీష్, హిందీలో అందుబాటులో ఉంటాయి.
- బడ్జెట్ ప్రవేశపెట్టిన తేదీ నుంచి దాన్ని అమలు చేయాలంటే 1-2 నెలల సమయం పడుతుంది. గతంలో మార్చి చివరి నాటికి బడ్జెట్‌ను ప్రవేశపెట్టేవారు. దాంతో అది జూన్ వరకు అమలు అయ్యేది. కానీ ప్రస్తుతం ఫిబ్రవరిలో బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. దాంతో ఏప్రిల్-మే వరకు అమలు అవుతుంది.
సమయం: 10:18 AM
- మరికాసేపట్లో కేంద్ర బడ్జెట్
- మరో గంటలో పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రసంగం
- స్వల్ప లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
- మరికాసేపట్లో కేంద్ర కేబినెట్ భేటీ
- బడ్జెట్‌కు ఆమోదం తెలపనున్న కేబినెట్
- ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటుకు చేరుకున్నారు. పార్లమెంటు భవనంలోని ప్రవేశిస్తూ బడ్జెట్ ట్యాబ్‌ను ఆమె ప్రదర్శించారు. మోదీ 3.0 పూర్తికాల బడ్జెట్‌ను నిర్మలా సీతారామన్ ప్రవేశపెడుతున్నారు.
కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పార్లమెంటుకు చేరుకున్నారు. అందరి కోసం ప్రవేశపెడుతున్న బడ్జెట్ ఇది అని చిప్పిన రాజ్‌నాథ్.
సమయం: 10:11 AM
రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశమైన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి.

పార్లమెంటులో ఈరోజు ఉదయం 11 గంటలకు బడ్జెట్ సమర్పణకు ముందు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో రాష్ట్రపతి భవన్‌లో సమావేశమయ్యారు. తిరిగి పార్లమెంట్‌కు వెళ్లారు.
★ పద్మ అవార్డు గ్రహీత దులారీ దేవి మధుబని కళకు నివాళిగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రత్యేక చీర కట్టుకున్నారు. దులారీ దేవి 2021 పద్మశ్రీ అవార్డు గ్రహీత
★ జమ్మూకశ్మీర్ బడ్జెట్ కాపీలు పార్లమెంటుకు చేరుకున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్ జమ్మూకశ్మీర్ బడ్జెట్ 2025-26 అంచనా రశీదులను సమర్పిస్తారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కలిసేందుకు ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచి రాష్ట్రపతి భవన్‌కు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బయలుదేరారు.
కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నార్త్ బ్లాక్‌కు చేరుకున్నారు.
కేంద్ర బడ్జెట్ 2025 అంచనాలు ఇవే..
- ఆదాయపు పన్ను శ్లాబులను సవరించడం
- మౌలిక సదుపాయాల వ్యయాన్ని పెంచడం
- గ్రామీణాభివృద్ధి, విద్యకు కేటాయింపులను పెంచడం
కేంద్ర బడ్జెట్‌కు సమయం మొదలాయె..
2025–26 ఆర్థిక సంవత్సరానికి పూర్తిస్థాయి కేంద్ర బడ్జెట్‌ను కేంద్రమంత్రి 'నిర్మలా సీతారామన్' ఉదయం 11 గంటలకు పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రిగా సీతారామన్‌కు ఇది రికార్డు స్థాయిలో వరుసగా ఎనిమిదో బడ్జెట్ కావడం విశేషం. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అవతరించాలన్న ప్రధాని మోదీ ఆకాంక్షలకు అనుగుణంగా వివిధ రంగాలకు ప్రాధాన్యతల మేరకు నిధులు కేటాయింపులు చేయనున్నారు.
Tags
- Budget 2025
- Union budget 2025-26
- Budget Live Updates in Telugu 2025
- Budget 2025 Highlights in Telugu
- Budget Highlights 2025
- Budget Allocation 2025
- Agriculture Budget 2025
- railway budget 2025
- Defense budget 2025
- Budget Live 2025
- Budget Speech 2025
- Nirmala Sitharaman Speech
- Union Budget 2025 Live Updates in Telugu
- Sakshi Education News
- Sakshi Education Updates
- Budget 2025 Live Updates
- Parliament Budget Session 2025
- Union Budget 2025
- Budget 2025 Speech LIVE
- Union Budget News LIVE
- Parliament Budget Session Live