Vantara Rescue Centre: 'వంతారా'ను ప్రారంభించిన ప్రధాని మోదీ

గుజరాత్‌లోని వన్యప్రాణుల రక్షణ, పునరావాసం & సంరక్షణ కేంద్రంమైన 'వంతారా'ను మోదీ ప్రారంభించారు. అక్కడ పరిసరాలను సందర్శించారు. అక్కడ పునరావాసం పొందుతున్న వివిధ జాతుల జంతువులతో ఆయన సన్నిహితంగా మెలిగారు.
వంతారాలోని వన్యప్రాణుల ఆసుపత్రిని ప్రధానమంత్రి సందర్శించారు. అక్కడ జంతువుల కోసం ఏర్పాటు చేసిన MRI, CT స్కాన్‌లు, ICUలు మొదలైన వాటితో కూడిన పశువైద్య సౌకర్యాలను వీక్షించారు. అంతే కాకుండా వైల్డ్‌లైఫ్ అనస్థీషియా, కార్డియాలజీ, నెఫ్రాలజీ, ఎండోస్కోపీ, డెంటిస్ట్రీ, ఇంటర్నల్ మెడిసిన్ మొదలైన అనేక విభాగాలను కూడా పరిశీలించారు.
ఆసియాటిక్ సింహానికి MRI చేయడం, హైవేలో కారు ఢీకొట్టిన తర్వాత గాయపడిన చిరుతకు ఆపరేషన్ చేయడం వంటి దృశ్యాలను మోదీ చూసారు. ఆసియాటిక్ సింహం పిల్లలు, తెల్ల సింహం పిల్ల, అరుదైన, అంతరించిపోతున్న జాతి చిరుతపులి పిల్ల, కారకల్ పిల్ల వంటి వివిధ జాతులతో సరదాగా గడిపడమే కాకుండా.. వాటికి పాలు పట్టించడం వంటివియు కూడా మోదీ చేశారు.
Gir National Park: గిర్ వన్యప్రాణుల అభయారణ్యంలో ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలివే..!
వంతారా వణ్యప్రాణి సంరక్షణ కేంద్రంలో ప్రధాని మోదీ పర్యటన
వంతారా కేంద్రంలో.. రక్షించబడిన జంతువులను వాటి సహజ ఆవాసాలను దగ్గరగా ప్రతిబింబించే ప్రదేశాలలో ఉంచారు. ఇక్కడ ఆసియాటిక్ సింహం, చిరుత, ఒక కొమ్ము గల ఖడ్గమృగం, జిరాఫీ, చింపాంజీ, ఒరంగుటాన్, హిప్పోపొటామస్, మొసళ్ళు, ఏనుగులు, పెద్ద పాములు మొదలైన జంతువులను మోదీ చూశారు.
ప్రపంచంలోనే అతిపెద్ద ఆసుపత్రి అయిన ఏనుగుల ఆసుపత్రిని కూడా ఆయన సందర్శించారు. జంతువులను వీక్షించడమే కాకుండా.. వాటికి సేవ చేస్తున్న వైద్యులు, సహాయక సిబ్బంది, కార్మికులతో ప్రధానమంత్రి సంభాషించారు. వంతారాలో 2,000 కంటే ఎక్కువ జాతులు.. రక్షించబడిన, అంతరించిపోతున్న 1.5 లక్షలకు పైగా జంతువులు ఉన్నాయి.
NXT Conclave: ప్రపంచ శక్తిగా భారత్.. ఎన్‌ఎక్స్‌టీ సదస్సులో ప్రధాని మోదీ