Half Day Schools : పెరుగుతున్న ఎండలు.. రాష్ట్రంలో హాఫ్‌డే స్కూల్స్.. ఇప్పటినుంచి!!

సాక్షి ఎడ్యుకేషన్: రాష్ట్రంలో రోజురోజుకి ఎండు మరింత పెరుగుతూనే ఉన్నాయి. దీంతో, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులను ఎదురుకుంటున్నారు. కొందరు అస్వస్థతకు గురవుతున్నారు. కొందరు భయంతో బడికి వెళ్లడం లేదు. అయితే, విద్యార్థులకు సమయాన్ని తగ్గించడం లేదా సెలవులను ప్రకటించడం వంటిది ఏదైనా చేయాలని తల్లిదండ్రులు అధికారులను కోరుతున్నారు.
ఇక ఇప్పటికే రంజన్ పండగ నేపథ్యంతో తెలంగాణ రాష్ట్రంలోని ఉర్దూ విద్యార్ధులకు ఒంటి పూట బడులు ప్రారంభమైనాయి. ఇప్పటికే, విద్యార్థులకు ఒంటిపూట బడులను నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు.
ప్రణాళికలు సిద్ధం..
ఏపీ రాష్ట్రంలోని పాఠశాలల్లో రానున్న రోజుల్లో ఒంటిపూట బడులు ప్రారంభం అవుతాయి. ఏపీలో ఎంతల తీవ్రత మరింత పెరిగిపోయింది. విద్యార్థులు బడికి, ఇంటికి తిరిగే దశలో ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. దీంతో, సర్కార్ ఈ నిర్ణయం ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యా సంస్థలకు ఈనెల.. మార్చి 15 నుంచి ఒంటి పూట బడులు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ ఇప్పటికే ప్రాణాళికలు కూడా సిద్ధం చేసింది.
వాతావరణ శాఖ హెచ్చరిక
ఇప్పటికే, ఎండల తీవ్ర పెరుగుతున్నందున విద్యార్థులకు ఒంటిపూట బడులను మార్చి మొదటి వారం నుంచే నిర్వహించాలని ఉపాధ్యాయులు కోరినప్పటికీ.. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. దీంతో మార్చి 15 నుంచే ఒంటి పూట బడులు ప్రారంభమవుతాయని తెలుస్తోంది. ఇదిలా ఉంటే, ఎప్పుడూ లేనివిధనంగా ఈ సారి ఎండలు తీవ్రంగా ఉంటాయని వాతావరణ శాఖ కూడా హెచ్చరిస్తోంది.
Social Media వాడకం పై ఆందోళన.. తప్పుడు వయస్సుతో అకౌంట్లు.. అకౌంట్లపై నియంత్రణ తప్పనిసరి!
మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ఎండల తీవ్రత సాధారణం కంటే అధికంగా ఉంటుందని, వడగాలులు కూడా తీవ్రంగా ఉంటాయని హెచ్చరికలు జారీ చేస్తోంది. దీంతో, వీలైనంత త్వరగా ఒంటిపూట బడులు ప్రారంభించాలనే ఆలోచనలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఉన్నాయి.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- half day schools
- AP Schools
- schools and college students
- AP government
- half day schools in march
- Education Institutions
- students health and education
- heavy heat in ap
- Summer Schools
- weather report in ap
- Meteorological Department
- teachers and parents request
- march 15th
- Half Day schools in AP
- ap government and private schools
- Education News
- Sakshi Education News