Skip to main content

Union Budget 2025: ఇక నుంచి ధరలు తగ్గేవి, పెరిగేవి వీటికే..

కేంద్ర బడ్జెట్‌ 2025-26లో కొన్ని రకాల వస్తువలపై కేంద్ర ప్రభుత్వం కస్టమ్‌ డ్యూటీని పూర్తీగా మినహాయించింది.
Union Budget 2025-26: List of items fully exempted from Basic Custom Duty

ప్రాథమిక కస్టమ్ డ్యూటీ (BCD) నుంచి పూర్తిగా మినహాయించిన వస్తువుల జాబితాలో 36 ప్రాణ రక్షక మందులు, వెట్‌ బ్లూ లెదర్‌, లిథియం బ్యాటరీలు ఉన్నాయి.

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1వ తేదీ వరుసగా ఎనిమిదో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న సందర్భంగా ఈ మినహాయింపులు ప్రకటించారు. దీంతో వీటి ధరలు తగ్గే అవకాశం ఉంటుంది. ప్రాథమిక కస్టమ్ డ్యూటీ నుంచి పూర్తిగా మినహాయించిన వస్తువులు ఇవే..

ధరలు తగ్గేవి ఇవే..

  • 36 ప్రాణ రక్షక ఔషధాలు
  • ఈవీల తయారీకి ఉపయోగించే 35 రకాల ముడిపదార్థాలు
  • వెట్‌ బ్లూ లెదర్‌
  • లిథియం బ్యాటరీలు స్క్రాప్
  • కోబాల్ట్ ఉత్పత్తులు
  • ఎల్‌ఈడీలు
  • జింక్
  • 12 క్లిష్టమైన ఖనిజాలు
  • చేపల పేస్ట్‌పై సుంకం 30% నుంచి 5%కి తగ్గింపు

ధరలు పెరిగేవి వీటికే..

  • ఫ్లాట్ ప్యానెల్ డిస్‌ప్లే
  • సిగరెట్లు

 

Union Budget 2025 Live Updates in Telugu:  కేంద్ర బడ్జెట్‌లోని ముఖ్యమైన అంశాలు ఇవే..

Published date : 01 Feb 2025 02:48PM

Photo Stories