Skip to main content

Mohammad Mokhber: ఇరాన్‌ తాత్కాలిక అధ్యక్షుడిగా నియ‌మితులైన‌ మహమ్మద్ మొఖ్బర్

ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్‌ ప్రమాదంలో మే 19వ తేదీ మరణించారు.
Iran's first vice president Mohammad Mokhber appointed president by supreme leader

ఈ నేపథ్యంలో మహమ్మద్‌ మొఖ్బర్‌ను తాత్కాలిక అధ్యక్షుడిగా నియమించారు. సుప్రీం లీడర్‌ అయతొల్లా అలీ ఖమేనీ ఈ నిర్ణయానికి ఆమోదం తెలిపారు.
 
ఇస్లామిక్‌ రిపబ్లిక్‌ రాజ్యాంగం ప్రకారం, అధ్యక్షుడు అకస్మాత్తుగా మరణిస్తే ఫస్ట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఆ పదవిని చేపడతారు. అయితే, ఈ నిర్ణయానికి సుప్రీం లీడర్‌ ఖమేనీ ఆమోదం తప్పనిసరి.

Ebrahim Raisi: హెలికాఫ్టర్‌ ప్రమాదంలో ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణం.. 

➤ 1955లో జన్మించిన మొఖ్బర్‌ ప్రస్తుతం ఇరాన్‌ ఫస్ట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా ఉన్నారు.
➤ 1980లో ఇరాన్-ఇరాక్ యుద్ధ సమయంలో ఐఆర్‌జీసీ మెడికల్ కోర్‌లో అధికారిగా పనిచేశారు.
➤ ఖుజెస్థాన్‌ ప్రావిన్స్ డిప్యూటీ గవర్నర్‌గా బాధ్యతలు నిర్వహించారు.
➤ టెలికమ్యూనికేషన్స్‌, బ్యాంకింగ్‌ రంగాల్లో గణనీయమైన అనుభవం కలిగి ఉన్నారు.
➤ 2022లో ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర సమయంలో మాస్కోకు డ్రోన్లు, క్షిపణుల సరఫరా ఒప్పందాన్ని ఖరారు చేయడంలో కీలక పాత్ర పోషించారు.
➤ అణు, బాలిస్టిక్‌ క్షిపణి కార్యకలాపాల్లో ప్రమేయం కారణంగా యూరోపియన్‌ యూనియన్‌ నుంచి ఆంక్షలను ఎదుర్కొంటున్నారు.

 

Russia Defence Minister: రష్యా నూతన రక్షణ మంత్రిగా ఆండ్రీ బెలౌసోవ్‌

Published date : 22 May 2024 01:06PM

Photo Stories