Ebrahim Raisi: హెలికాఫ్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణం..
రైసీతో పాటు ఆ విదేశాంగ మంత్రి హొస్సేన్ అమీరబ్దొల్లహియన్, ఇతర ఉన్నతాధికారులు సైతం మృతి చెందారు. అజర్‌బైజాన్-ఇరాన్ సరిహద్దులోని జోల్ఫా పట్టణం దగ్గరగా ఉన్న పర్వత ప్రాంతంలో పూర్తిగా కాలిపోయిన స్థితిలో హెలికాఫ్టర్‌ను గుర్తించిన ఇరాన్ బలగాలు.. ఈ ప్రమాదంలో ఎవరూ బతికే అవకాశాలు లేవని ప్రకటించాయి.
మే 19వ తేదీ సాయంత్రం హెలీకాప్టర్ కుప్పకూలిన ఘటనలో వీరు దుర్మరణం చెందారు. ఆ రోజు అజర్‌బైజాన్ సరిహద్దులో ఇరు దేశాలు సంయుక్తంగా నిర్మించిన రెండు డ్యామ్‌లను ఆ దేశ అధ్యక్షుడు ఇల్హమ్ అలియేవ్‌తో కలిసి రైసీ ప్రారంభించారు.
Andrei Belousov: రష్యా నూతన రక్షణ మంత్రిగా ఆండ్రీ బెలౌసోవ్
ఇబ్రహీం రైసీ ఇరాన్ సుప్రీం అయతుల్లా ఖమేనీకి అత్యంత సన్నిహితుడు. 2021వ సంవత్సరంలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఆయన విజయం సాధిందారు. ఖమేనీకి వారసుడిగా గుర్తింపు పొందిన ఈయన 1988 సంవత్సరంలో ఖైదీలను సామూహికంగా ఉరితీసినందుకు ఆంక్షల్ని ఎదుర్కొంటూ ఉన్నారు. అధ్యక్షుడిగా అధికారం చేపట్టినప్పటి నుంచి ఇరాన్‌లో ఇస్లామిక్ చట్టాలను కఠినతరం చేయాలని ఆదేశించారు. తన హయాంలో ప్రభుత్వ వ్యతిరేక నిరసనల్ని వ్యతిరేఖించారు. ఈ దేశాన్ని అణ్వస్త్రంగా మారుస్తానని ఎప్పుడూ చెప్పేవారు.
Vladimir Putin: రికార్డు.. రష్యా అధ్యక్షుడిగా ఐదోసారి ప్రమాణ స్వీకారం చేసిన పుతిన్