Skip to main content

Vladimir Putin: రికార్డు.. రష్యా అధ్యక్షుడిగా ఐదోసారి ప్రమాణ స్వీకారం చేసిన పుతిన్

రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమిర్‌ పుతిన్‌ ఐదోసారి ప్రమాణం చేశారు.
Putin To Be Sworn In As Russian President For Record 5th Term

మే 7వ తేదీ క్రెమ్లిన్‌ ప్రాసాదంలో 2,500 మంది ముఖ్య అతిథుల సమక్షంలో పుతిన్‌ రష్యా రాజ్యాంగంపై ప్రమాణం చేశారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ అన్ని అడ్డంకులను అధిగమిస్తూ ఐక్యంగా ఉంటూ లక్ష్యాలను అధిగమించి, విజయాలను అందుకుంటామని చెప్పారు.

ఈ కార్యక్రమానికి అమెరికా నటుడు స్టీవెన్‌ సీగల్‌ వంటి పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. అయితే, అమెరికా, యూకే, జర్మనీ దౌత్యవేత్తలు హాజ‌రుకాలేదు. 

అంతకుముందు పుతిన్‌ 30 గన్‌ సెల్యూట్‌ స్వీకరించారు. క్రెమ్లిన్‌ కేథడ్రల్‌ స్క్వేర్‌ వద్ద ప్రెసిడెన్షియల్‌ రెజిమెంట్‌ పరేడ్‌ను తిలకించారు. దగ్గర్లోని అనన్షియేషన్‌ కేథడ్రల్‌లో రష్యన్‌ ఆర్థోడాక్స్‌ పాటియార్క్‌ కిరిల్‌ ఆశీస్సులు అందుకున్నారు. ఆరేళ్ల పదవీ కాలానికి గాను 2030 వరకు ఆయన అధ్యక్ష పదవిలో కొనసాగుతారు.

Securities Appellate Tribunal: సాట్‌ ప్రిసైడింగ్ ఆఫీసర్‌గా నియ‌మితులైన‌ జస్టిస్ దినేష్ కుమార్

పుతిన్‌.. జోసఫ్‌ స్టాలిన్‌ తర్వాత అత్యధిక కాలం రష్యాను పరిపాలించిన నేతగా నిలువనున్నారు. ఈయ‌న‌ ఇప్పటికే 25 ఏండ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్నారు. అధ్యక్షుడు బోరిస్‌ ఎల్టిసిన్‌ తర్వాత పుతిన్‌ అధ్యక్షుడు లేదా ప్రధానిగా 1999 నుంచి ఈ పదవిలో ఉన్నారు. 

Published date : 09 May 2024 11:18AM

Photo Stories