Securities Appellate Tribunal: సాట్ ప్రిసైడింగ్ ఆఫీసర్‌గా నియమితులైన జస్టిస్ దినేష్ కుమార్
Sakshi Education
జస్టిస్ (రిటైర్డ్) దినేష్ కుమార్ ఏప్రిల్ 29వ తేదీ సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్ (SAT) ప్రిసైడింగ్ ఆఫీసర్‌గా బాధ్యతలు స్వీకరించారు.
➤ భారతదేశ ప్రభుత్వం దినేష్‌ను నాలుగు సంవత్సరాల కాలానికి నియమించింది.
➤ ఈయన సాట్(SAT) ప్రిసైడింగ్ అధికారిగా బాధ్యతలు స్వీకరించడానికి ముందు కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు.
➤ చివరి ప్రిసైడింగ్ అధికారి జస్టిస్ తరుణ్ అగర్వాల్ 2023 డిసెంబర్లో పదవీ విరమణ చేశారు.
➤ ట్రిబ్యునల్ సాంకేతిక సభ్యుడిగా ధీరజ్ భట్నాగర్ కూడా బాధ్యతలు చేపట్టారు.
➤ ప్రిసైడింగ్ ఆఫీసర్ నియమితులైన వారు నాలుగు సంవత్సరాల పదవీ కాలానికి లేదా 67 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు అర్హులు.
➤ ఢిల్లీ ఇన్‌కమ్ ట్యాక్స్ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్‌గా ధీరజ్ భట్నాగర్ పదవీ విరమణ చేశారు.
➤ ముగ్గురు సభ్యులతో కూడిన ఇందులో మరో సభ్యుడు మీరా స్వరూప్.
Miss Universe: అందాల పోటీల్లో విజేతగా 60 ఏళ్ల భామ.. చరిత్రలో ఇదే ఫస్ట్‌టైం!!
Published date : 04 May 2024 01:28PM