Miss Universe: అందాల పోటీల్లో విజేతగా 60 ఏళ్ల భామ.. చరిత్రలో ఇదే ఫస్ట్‌టైం!!
కానీ ఇటీవల ఇటీవల బ్యూనస్ ఎయిర్స్ ప్రావిన్స్‌లో అందాల పోటీలు జరిగాయి. ఇందులో బ్యూనస్ ఎయిర్స్ ప్రావిన్స్ రాజధాని లా ప్లాటాకు చెందిన అలెజాండ్రా పాల్గొని టైటిల్ నెగ్గారు. అందాల పోటీల్లో ఈ వయసులో కిరీటం పొందిన తొలి మహిళగా రికార్డు సృష్టించారు. సంకల్పానికి వయసు అడ్డు కాదని నిరూపించారు.
ఈ ఏడాది మే నెలలో జరగబోయే ‘మిస్ యూనివర్స్ అర్జెంటీనా’ పోటీల్లో ఈమె బ్యూనస్ ఎయిర్స్ తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు. అక్కడ గెలిస్తే సెప్టెంబరులో మెక్సికో వేదికగా జరిగే ‘విశ్వసుందరి 2024’ పోటీల్లో తన దేశం తరఫున పాల్గొంటారు. కాగా అభ్యర్థులకు వయోపరిమితిని తొలగిస్తూ ‘మిస్ యూనివర్స్’ ఆర్గనైజేషన్ గతేడాది నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఈ అందాల పోటీలో 18-28 ఏళ్ల వయసున్న మహిళలే పాల్గొనే వీలుండేది. ఈ ఏడాది నుంచి 18 ఏళ్లు పైబడిన యువతులందరికీ అవకాశం కల్పిస్తున్నారు.
Argentina's 60-year-old woman representing Buenos Aires (Miss Universe Buenos Aires winner) plans to become the oldest Miss World Universe Contestant. pic.twitter.com/fqYuxmtJPB
— Creepy.org (@creepydotorg) April 27, 2024