Andrei Belousov: రష్యా నూతన రక్షణ మంత్రిగా ఆండ్రీ బెలౌసోవ్
రాజ్యాంగం ప్రకారం మే 11వ తేదీ మంత్రివర్గం మొత్తం రాజీనామా చేసింది. పాత కేబినెట్‌లో రక్షణ మంత్రి సెర్గీ షోయిగుకు మాత్రమే అవకాశమివ్వలేదు. రక్షణ శాఖ సహాయ మంత్రి తిమూర్ ఇవనోవ్ అవినీతి ఆరోపణలతో అరెస్ట్ కావడంతో షోయిగుకు పదవీ గండం తప్పదని కొన్ని రోజులుగా వస్తున్న వార్తలు నిజమయ్యాయి.
మే 12వ తేదీ అధ్యక్షుడు పుతిన్ నూతన రక్షణ మంత్రిగా ఆండ్రీ బెలౌసోవ్(65)ను నియమిస్తున్నట్లు ప్రకటించారు. షోయిగుకు రష్యా సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ బాధ్యతలను అప్పగించారు. ఆండ్రీ బెలౌసోవ్ 2020 నుంచి ఫస్ట్ డిప్యూటీ ప్రధానమంత్రిగా కొనసాగుతున్నారు. అంతకుముందు ఏడేళ్లపాటు పుతిన్ సలహాదారుగా ఉన్నారు. కొత్త ఆవిష్కరణలకు, నూతన ఆలోచనలకు అనుగుణంగా రక్షణ శాఖను తీర్చిదిద్దేందుకే బెలౌసోవ్‌ను నియమించినట్లు అధ్యక్ష భవనం తెలిపింది.
Vladimir Putin: రికార్డు.. రష్యా అధ్యక్షుడిగా ఐదోసారి ప్రమాణ స్వీకారం చేసిన పుతిన్