Skip to main content

AP Grama Sachivalayam Employees : గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం కీలక ఆదేశాలు.. ఇక‌పై వీరు.. !

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఏపీ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం కీలక ఆదేశాలు ఇచ్చింది. ఉద్యోగులు రోజులో మూడు సార్లు కచ్చితంగా బయోమెట్రిక్ హాజరు నమోదు చేయాలని ఆదేశించింది.
AP Grama Sachivalayam Employees

ప్రతి రోజూ ఉదయం 10.30 గంటలకు ముందు ఒక‌సారి బయోమెట్రిక్ హాజరు ఇవ్వాలి. అలాగే మధ్యాహ్నం 3 గం.లకు, సాయంత్రం 5 గంటల తర్వాత ఇలా బయోమెట్రిక్ హాజరు  వేయాలని జీవో జారీ చేసింది. అయితే గత ప్రభుత్వ హయాంలోనే ఈ నిబంధన ఉండగా.. బయోమెట్రిక్ విధానం సరిగ్గా అమలు కావడంలేదన్న ఆరోపణలతో తాజాగా ఈ ఆదేశాలు జారీ చేసింది. ఇక నుంచి రోజుకు మూడుసార్లు హాజరు కచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేసింది. 
ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు హాజరు ప్రక్రియను పర్యవేక్షించనున్నారు. మొబైల్ యాప్‌లో ఉద్యోగులు నమోదు చేసిన హాజరునే పరిగణలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది. 

అదే విధంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో పని చేసే ఉద్యోగులకు బయోమెట్రిక్ హాజరు ఆధారంగానే వేతనాలు ఇవ్వనున్నారు. ఈ మేరకు డీడీవోలకు గ్రామ, వార్డు సచివాలయ శాఖ తాజాగా ఆదేశాలు ఇచ్చింది.

Published date : 26 Dec 2024 07:08PM

Photo Stories