Skip to main content

AP Anganwadi Jobs 2024 : ఏపీలో అంగన్‌వాడీ ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల‌... ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేదీ ఇదే...

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఇటీవ‌ల కాలంలో అంగన్‌వాడీ ఉద్యోగాల‌కు భారీగా డిమాండ్ పెరుగుతోంది. తాజాగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం వివిధ జిల్లాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల‌కు జిల్లాల వారిగా నోటిఫికేష‌న్లు విడుద‌ల చేస్తోంది.
AP Anganwadi Jobs 2024 Notification

తాజాగా అన్నమయ్య జిల్లాలోని ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్న 116 అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. 

అన్నమయ్య జిల్లాలోని అంగన్‌వాడీ ఖాళీలు ఇవే...
మొత్తం 11 ప్రాజెక్టుల పరిధిలో కార్యకర్తల పోస్టులు 11, మినీ కార్యకర్త 12, సహాయకుల పోస్టులు 93 ప్రకారం ఖాళీగా ఉన్నాయి. 

అర్హతలు ఇవే..: 
10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. స్థానికంగా నివాసిస్తున్న వివాహిత మ‌హిళలు మాత్ర‌మే ఈ పోస్టులకు అర్హులు. వ‌యోప‌రిమ‌తి 21 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.

ద‌ర‌ఖాస్తు చివ‌రి తేదీ ఇదే..
ఈ ఉద్యోగాల‌కు.. 2025 జనవరి 2వ తేదీలోపు ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. 

ఈ ప్రాంతంలోనే...
బి.కొత్తకోట, చిట్వేల్‌, ఎల్‌ఆర్‌ పల్లి, మదనపల్లి, పీలేర్‌, రైల్వే కోడూరు, రాజంపేట, రాయచోటి, టి.సండుపల్లి, తంబలపల్లి, వాల్మీకిపురం ప్రాజెక్టుల పరిధిలో ఖాళీలు ఉన్నాయి. 

దరఖాస్తు విధానం ఇలా : 
ఈ ఉద్యోగాల‌ను ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను సంబంధిత ఐసీడీఎస్‌ ప్రాజెక్ట్ కార్యాలయంలో అందజేయాలి. బ‌యోడేటాతో పాటు విద్యార్హ‌తలు, ఇత‌ర స‌ర్టిఫికెట్లు జిరాక్స్ కాపీల‌పై గెజిటెడ్ ఆఫీస‌ర్‌తో అటెస్టేష‌న్ చేయించి, ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాల‌యంలో అప్లికేష‌న్ అంద‌జేయాలి. 

ఎంపిక విధానం ఇలా.. : 
ఈ ఉద్యోగాల‌ను ఇంట‌ర్వ్యూ, మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎలాంటి రాత ప‌రీక్ష లేదు.

జీతం : 
ఈ ఉద్యోగాల‌కు ఎంపికైతే.. నెలకు అంగన్‌వాడీ వర్కర్ పోస్టులకు రూ.11500, మినీ అంగన్‌వాడీ వర్కర్‌కు రూ.7000, అంగన్‌వాడీ హెల్పర్‌కు రూ.7000 ఉంటుంది.

Published date : 26 Dec 2024 01:44PM

Photo Stories