TES Course Training: ఇండియన్ ఆర్మీలో టీఈఎస్ కోర్సు శిక్షణలో ప్రవేశాలు..
సాక్షి ఎడ్యుకేషన్:
» మొత్తం పోస్టుల సంఖ్య: 90
» అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి 60 శాతం మార్కులతో 10+2(ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమేటిక్స్) లేదా దానికి సమానమైన పరీక్షతోపాటు జేఈఈ(మెయిన్స్) 2024లో ఉత్తీర్ణులై ఉండాలి. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
» వయసు: 16.5 ఏళ్ల నుంచి 19.5 ఏళ్ల మధ్య ఉండాలి.
» ఎంపిక విధానం: జేఈఈ(మెయిన్స్) స్కోరు, స్టేజ్–1, స్టేజ్–2 పరీక్షలు, ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
» కోర్సు, శిక్షణ: మొత్తం ఐదేళ్లు కోర్సు, శిక్షణ కొనసాగుతుంది. ఇందులో ఏడాది పాటు బేసిక్ మిలిటరీ ట్రైనింగ్, నాలుగేళ్లు టెక్నికల్ ట్రైనింగ్ ఇస్తారు. శిక్షణ, కోర్సు విజయవంతంగా పూర్తిచేసుకున్నవారికి ఇంజనీరింగ్(బీఈ/బీటెక్) డిగ్రీ అందజేస్తారు.
» దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
» ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 13.05.2024.
» ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 13.06.2024
» వెబ్‌సైట్: https://joinindianarmy.nic.in
NDA and NA Notification: ఎన్‌డీఏ, ఎన్‌ఏ(2)–2024 నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తులకు చివరి తేదీ!