సివిల్స్ ఇంటర్వ్యూలో విజయం సాధించడానికి కావాల్సిన 5 లక్షణాలు: శ్రీరామ్ శ్రీరంగం
సివిల్స్ ఇంటర్వ్యూ
ఇప్పుడు గేర్లు మార్చి పరీక్ష ప్రక్రియలో కీలకమైన చివరి అంకం అయిన పర్సనాలిటీ టెస్టును కూడా అంతే సామర్థ్యంతో ఎదుర్కోవాల్సిన సమయమిది. కీలకమయిన తేడా ఏమిటంటే ఇది పూర్తిగా మౌఖిక పరీక్ష. చాలా కఠినమైనది కూడా. ప్రస్తుత, లేదా మాజీ సివిల్ సర్వెంట్ లు, ఎకనమిక్స్ , సోషియాలజీ, అంతర్జాతీయ సంబంధాలు, భారత రాజ్యాంగం వంటి పలు సబ్జెక్టుల్లో నిపుణులతో, అయిదుగురు ప్రముఖులతో కూడిన బోర్డు ఇంటర్వ్యూ చేస్తుంది.
Inspiring Success Story: మహిళల కేటగిరీలో సివిల్స్ టాపర్స్ విజయ రహస్యాలు ఇవే..
పర్సనాలిటీ టెస్ట్ 275 మార్కులకు ఉంటుంది. మెయిన్స్‌లో మాదిరిగానే వాస్తవాలు, విశ్లేషణ తదితరాలపై లోతుగా ప్రశ్నలు అడుగుతారు. అయితే, గుర్తించదగిన వ్యత్యాసం ఉంది. మెయిన్ ఎగ్జామ్‌లో అయితే ఇన్విజిలేటర్ తప్పమరెవరూ అభ్యర్థిని గమనించరు. కానీ ఇక్కడ అలా కాదు. మొత్తం పానెల్ దృష్టి అంతా మీ మీదే ఉంటుంది. అందుకే సరిగా ప్రిపేర్ అయి వెళ్ళకుంటే ఇందులో మంచి మార్కులు సాధించలేం. ప్రతి తప్పునూ వాళ్ళు ఇట్టే పట్టేస్తారు. ఏవో చిన్న చిన్న పొరపాట్లకు మాత్రం బహుశా మినహాయింపు ఉండవచ్చు. అభ్యర్థి గనుక సివిల్ సర్వెంట్ కు ఉండాల్సిన చక్కటి లక్షణాలను కనబరిస్తే మంచి ప్రతిఫలం తప్పకుండా ఉంటుంది. మరి ఏమిటా చక్కటి లక్షణాలు?
- మొదటిది, అన్నింటి కంటే ముఖ్యమయినది . మనం మనలా ఉండటం. ప్రతి ఒక్కరి స్పందనలో ఏదో ప్రత్యేకత, విలక్షణత ఉంటాయి.. మెయిన్ లేదా ఇంటర్వ్యూలో అయినాఇది మనం ఇచ్చే సమాధానం గురించి కాదు-. ఇది మన ప్రతిస్పందనను,స్వభావాన్ని, మనం వాడే పదాలను, బాడీ లాంగ్వేజ్-ముఖ్యంగా ముఖ కవళికలకు పరీక్ష.
- తదుపరిది... మన వైఖరి. ఇది సమాజం, ప్రపంచంలోని వివిధ అంశాలను మనం విశ్లేషించే విధానాన్ని తెలుపుతుంది.మన పక్షపాతాలు,నమ్మకాలు బహిర్గతమవుతాయి.మనస్సాక్షి, జ్ఞానం, గ్రహణశక్తి ఉంటే తప్ప వాటిని అధిగమించడం అంత సులువు. అయితే నేను అనుభవపూర్వకంగా చెప్పగలను.... అభ్యర్థులు తమను తాము మాలుచుకోవడంలో చాలా సమర్థత కలిగి ఉంటారని.
- చురుకుదనం ....చాలా అవసరమైనది. చురుకుదనం అంటే కేవలం త్వరగా స్పందిండం, సమాధానం ఇవ్వడమే కాదు. అంతకు మించి చాలా..... చురుకుదనం అనేది అవగాహన, శ్రద్ధ, ప్రతిస్పందన. ఇది సంధించిన ప్రశ్నకు మన దగ్గరి సమాచారాన్ని సమర్థవంతమైన పద్ధతిలో అన్వయించడం- కోరుకున్న ఫలితాలను సాధించడం. ప్రతి అభ్యర్థికి తనదైన శైలి, విషయం ఉంటాయి.
- ఇక విశ్వాసం అనేది కూడా ముఖ్యమైనదే. అయితే ఆత్మనూన్యత ఉండకూడదు. అలా అని మితిమీ రిన విశ్వాసమూ పనికిరాదు. ఏదైనా విషయాన్ని గుర్తు తెచ్చుకోడానికి, విశ్లేషించడానికి విశ్వాసం మీకు సహాయపడుతుంది. సరైన వాతావరణాన్ని కూడా సెట్ చేస్తుంది. ఆత్మనూన్యత అస్సలు మంచిది కాదు. మీరు సమర్థులు గనుకే ఇక్కడిదాకా రాగలిగారని గుర్తుంచుకోండి. అలాగని మితిమీరిన విశ్వాసమూమంచిది కాదు. పైగా అది ఆత్మహత్యా సదృశం కూడా కావచ్చు. కాబట్టి ఇంటర్వ్యూసమయంలో, నిజ జీవితంలో కూడా దాన్నిపూర్తిగా వదిలేయండి.
- ఇక హాస్య చతురత విషయం. కార్పొరేట్, అకడమిక్ ఇంటర్వ్యూలలోఇది చెల్లుబాటు అవుతుందేమో.ఇక పాత్రికేయ ఇంటర్వ్యూలలోదీన్ని బహుశా ప్రశంసిస్తారేమో కూడా. కానీ బ్యూరోక్రాటిక్ ఇంటర్వ్యూలలోమాత్రం హాస్యానికి అస్సలు చోటు ఉండదు. అత్యంత అరుదయిన సందర్భాలలో తప్ప సివిల్స్ వంటి ఇంటర్వ్యూలలో జోక్స్ వేయడం మంచిది కాదు. ఇంటర్వ్యూ బోర్డు సభ్యులు మంచి నాణ్యతతో కూడిన జోకులు వేస్తే వేయవచ్చు. కానీ వాటికి ఏ మోతాదులో, ఎలా నవ్వాలో కచ్చితంగా తెలిస్తే తప్ప మీరు అస్సలు నవ్వకపోవడమే మేలు. ఎందుకంటే బోర్డు మెంబర్ల జోకులకు నవ్వడం రిస్కీ వ్యవహారం. నవ్వుకు బదులుగా, అవసరమయిన చోట ఆహ్లాదకరమయిన ముఖ్య కవళికలతో ఇంటర్వ్యూ ముగించడం ఉత్తమం.
Success Story: నేను ఐఏఎస్ కొట్టానంటే.. నా సక్సెస్ మంత్రం ఇదే..
ప్రశ్నలు, సమాధానాలకు సంబంధించి కీలక విషయాలు:
- మీరు సమాధానం చెప్పలేని మరిన్ని ప్రశ్నలకు దారి తీస్తుందేమో అనే భయంతో ఏ ప్రశ్నకూ జవాబులు దాటవేయవద్దు.
- అవసరమయిన చోట ‘నాకు తెలియదు సర్/మేడమ్’ అని మర్యాద పూర్వకంగా చెప్పండి.
- అయితే ఒక్క మాట. విశ్లేషణాత్మక ప్రశ్నలకుమాత్రం 'నాకు తెలియదు' అని చెప్పనే కూడదు.
- లీడింగ్ ప్రశ్నలు,వాటి సమాధానాలకు ఎప్పుడూ సిద్ధంగా ఉండండి. ఉదాహరణకుశ్రీలంక ఆర్థిక సంక్షోభం గురించి ప్రశ్న అడిగితే, సంబంధిత ప్రశ్నలెన్నిటికో అది దారి తీయవచ్చు: అది ఎప్పుడు ప్రారంభమైంది;రుణం రూపంలో వల వేసే చైనా కుటిల దౌత్యం ఈ సంక్షోభంతో ఎలా బయట పడింది;శ్రీలంకను భారత్ ఎలా ఆదుకుంటోంది; ప్రస్తుతం భారత్ లో ఆర్ బీ ఐ అవలంబిస్తున్న కరెన్సీ స్వాప్ ను ఈ నేపథ్యానికి అన్వయించగలరా; సేంద్రియ సాగుకు మారడం శ్రీలంకకు ఎలా ఆత్మహత్యా సదృశ్యంగా మారింది; భారతదేశం సాగు విషయంలో నేర్చుకోవాల్సిన పాఠాలు; సంక్షోభం తాలూకు భౌగోళిక,లక్ష్యాన్ని సాధించేందుకు పూర్తి శక్తి సామర్థ్యాలతో ప్రయత్నం చేయండి.
ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని ఉన్నత స్థాయికి చేరుకోండి. అవసరమైతేఎన్నో రకాల సాయాలు నిత్యం అందుబాటులో ఉన్నాయని గుర్తుంచుకోండి. శుభాకాంక్షలు.
Success Story: రెండో అటెంప్ట్‌లోనే సివిల్స్.. ఈ యువ ఐఎఫ్‌ఎస్ అధికారి మాటతీరు చూస్తే...